కుప్పకూలిన దిగ్గజం, 22 వేల ఉద్యోగాలు ప్రమాదంలో

thomson staff
thomson staff

న్యూఢిల్లీ: యునైటెడ్‌ కింగ్‌డమ్‌కు చెందిన ట్రావెల్‌ దిగ్గజం థామస్‌కుక్‌ పిఎల్‌సి కుప్పకూలింది. ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ సంస్థ అదనపు నిధుల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో గత వారం దివాలాకు సంబంధించి చాప్టర్‌ 15 ప్రొసిడింగ్స్‌ను పైల్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం యూకేలోని అత్యుత్తమ బ్రాండ్లలో ఒకటైన ఈ సంస్థ దివాలా తీయడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం కంపెనీకి సంబంధించిన దివాలా పిటిషన్‌ లండర్‌ హైకోర్టులో విచారణకు రానుంది. చివరి వరకు వచ్చిన డీల్‌కు అదనంగా మరికొంత కోరడంతో చర్చలు ఫలప్రదం కాలేదు అని కంపెనీ సిఇఒ పీటర్‌ ఫాంక్‌ హాసర్‌ వెల్లడించారు. 178 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సంస్థ దివాలా ప్రకటించడంతో వేలాది మంది ఉద్యోగుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చివరి నిమిషంలో జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో థామస్‌ కుక్‌ దివాలా తీసింది. ప్రపంచవ్యాప్తంగా థామస్‌కుక్‌ తన విమాన సేవలను నిలిపివేసినట్లుగా బ్రిటిష్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ ప్రకటించింది. థామస్‌కుక్‌కు చెందిన విమాన, హాలిడే బుకింగ్స్‌లను రద్దు చేసినట్లు ప్రకటించింది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/