స్విస్‌ ఖాతాల వివరాలను ఇచ్చే అవకాశం లేదు

వెల్లడించిన ఆర్థిక శాఖ

Ministry of Finance
Ministry of Finance

ఢిల్లీ: భారతీయులు అత్యధికంగా నల్లధనం దాచుకున్న స్విస్‌ బ్యాంకు ఖాతాల వివరాలను ఇవ్వలేమని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. అంతేకాకుండా ఇతర దేశాలనుంచి వచ్చిన నల్లధనం వివరాలను కూడా సమాచార హక్కు చట్టం కింద ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. స్విట్జర్లాండ్‌తో కుదిరిన ఒప్పందం ప్రకారం గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో వివరాలను ఇచ్చేది లేదని పేర్కొంది. కాబట్టి పన్ను సంబంధిత వివరాలు, ఇతర దేశాల నుంచి వచ్చిన వివరాలు ఆర్‌టిఐలో 8(1)ఏ, 8(1)(ఎఫ్‌) కింద మినహాయింపు ఉంది అని ఈ మేరకు ఆర్‌టిఐ దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. భారత్‌ సహా 75 దేశాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకునే విధంగా ఒప్పందం కుదుర్చున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో ఎక్కువగా మూసివేసిన ఖాతాదారుల సమాచారమే ఉందని తెలిసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/