వరుస రాజీనామాలతో కుప్పకూలిన జెట్‌ షేర్లు

jet airways
jet airways

న్యూఢిల్లీ: రుణ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. కంపెనీ సిఈఓ విన§్‌ు దూబే, డిప్యూటి సిఈఓ అమిత్‌ అగర్వాల్‌ ఒక్క రోజు వ్యవధిలోనే తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ ప్రభావం కంపెనీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గత రెండు రోజులుగా భారీగా నష్టపోయిన జెట్‌ షేర్లు మూడో రోజు కూడా కుప్పకూలుతున్నాయి.
బుధవారం నాటి ట్రేడింగ్‌లో జెట్‌ షేర్లు భారీ నష్టాల్లో కొనసాగుతుంది. ఒకానొక దశలో షేరు ధర 7 శాతానికి పైగా నష్టంతో ట్రేడ్‌ అయ్యింది. గడచిన మూడు సెషన్లలో కంపెనీ షేరు ధర 20 శాతానికి పైగా పడిపోయింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/