విచారణ నిమిత్తం వాద్రాను కస్టడీ కివ్వండి

robert vadra
robert vadra


న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రాను మనీ లాండరింగ్‌ కేసులో విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కోరింది. ఈడి వద్ద ఉన్న ఆధారాల ప్రకారం వాద్రాకు ఒక కంపెనీతో 2008లో పెట్రోలియంపై ఒప్పందం ఉందని ఈ నేపథ్యంలో దీనిపై విచారించేందుకు ఆయన్ను కస్టడీలోకి తీసుకునేందుకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. కానీ వాద్రాకు బుధవారం వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ సమయంలో తగిన ఆధారాలను ఈడి సమర్పించాల్సి ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/