విద్యుత్‌ ఇంధనంతో కొత్త ఎయిర్‌ట్యాక్సీ

air taxi
air taxi

లండన్‌: జెట్‌ ఇంజన్ల సాయంతో రూపొందించిన ఎయిర్‌ట్యాక్సీ మొట్టమొదటిసారి విజయవంతంగాపరీక్షలు పూర్తిచేసింది. ఈ విమానం మొట్టమొదటి ప్రయత్నంగా 300 కిలోమీటర్ల రేంజిలో ఉంటుంది. న్యూయార్క్‌నుంచి బోస్టన్‌కు మధ్య ప్రయాణించేవీలుగా ఈ విమానం రూపొందింది. జర్మనీ స్టార్టప్‌ కంపెనీ లిలియమ్‌ ఈ ఎయిర్‌ట్యాక్సీని ఐదు సీట్ల సామర్ధ్యంతో రూపొందించింది. ఒక పైలట్‌ లేదా డ్రోన్‌ విధానంలో నగరాలకు ప్రయాణించేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా 2025 నాటికి ఈ ఎయిర్‌ట్యాక్సీలను తీసుకురావాలని నిర్ణయించారు. ఒక్కొక్క ప్రయాణానికి ఛార్జిలు వసూలుచేసే విధంగా ఉద్గారాల రహిత పూర్తి ఎలక్ట్రిక్‌ ఛార్జి విధానంలో రూపొందించారు. కారుకంటే ఐదురెట్లు వేగంగాప్రయాణిస్తుంది. మోటార్‌బైక్‌ విడుదలచేసేశబ్దం కంటే తక్కువగానే ఉంటుంది. ఈ విమానం 300 కిలోమీటర్ల రేంజిలో ఉంటుంది. జాన్‌ ఎఫ్‌ కెన్నడీ విమానాశ్రయంలో స్వల్ప వ్యవధి స్టాప్‌ ఉంటుంది. అలాగే మన్‌హట్టన్‌ ఎయిర్‌పోర్టులో కూడా కొద్దిసేపు అగుతుంది. ప్యాసింజర్‌కు 70 డాలర్లు తక్కువగాకుండా అత్యంత చౌక ప్రయాణానికి నాందిపలుకుంఉది. హెలికాప్టర్‌ ప్రయాణ ఛార్జీ కంటే తక్కువగా ఉంది.

తాజా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/latest-news/