34వ జిఎస్‌టి మండలి సమావేశానికి ఎన్నికలసంఘం గ్రీన్‌సిగ్నల్‌

న్యూఢిల్లీ : జిఎస్‌టి మండలి సమావేశం ఈనెల 19వ తేదీ జరగాల్సి ఉన్నందున ఎన్నికల సంఘం అనుమతికి దాఖలుచేయడంతో యధాతథంగా నిర్వహించుకోవచ్చని ఎన్నికల సంఘం ఆమోదించింది. జిఎస్‌టి మండలి సెక్రటేరియట్‌ ఇందుకు సంబంధించి 34వ సమావేశం ఈనెల 19వ తేదీజరుగుతుందని అన్ని రాష్ట్రాలకు లేఖలురాసింది.34వ జిఎస్‌టి సమావేశంలో రియాల్టీరంగంపైనే ఎక్కువచర్చలు జరగనున్నాయి. ఏప్రిల్‌ ఒకటవ తేదీనుంచి ఈ పన్నులు అమలులోనికి రావాలిస ఉంది. ప్రస్తుతం జిఎస్‌టి 12శాతం తోపాటు ఇన్‌పుట్‌ట్యాక్స్‌క్రెడిట్‌ సౌలభ్యాన్ని కూడా అమలుచేస్తోంది. నిర్మాణంలోఉన్న ఆస్తులు, ఇక అందుబాటులో పక్కాగృహాల ప్రాజెక్టుకు మాత్రం ప్రస్తుతం ఉన్న ఎనిమిదివాతం పన్నును ఒకటిశాతంగా నిర్ణయించింది. ఇక జిఎస్‌టి పన్ను రాబడులుసైతం ఫిబ్రవరిలో 97,247 కోట్లకు పడిపోయాయి. అంతకుముందు జనవరినెలలో 1.02 లక్షలకోట్లుగా ఉన్నాయి. సెంట్రల్‌ జిఎస్‌టి 17,626 కోట్లు, రాష్ట్రజిఎస్‌టిలు 24,192 కోట్లు, ఐజిఎస్‌టిలు 46,953కోట్లు సెస్‌ 8476 కోట్లు, వసూలయ్యాయి. ప్రస్తుత ఆర్ధికసంవత్సరంలో ఫిబ్రవరివరకూ రూ.10.70 లక్షలకోట్లుగా ఉన్నాయి. ప్రభుత్వం జిఎస్‌టి రాబడుల లక్ష్యాన్ని ప్రస్తుత సంవత్సరంలో 11.47లక్షలకోట్లకు తగ్గించింది. సవరించి అంచనాల్లో రూ.13.71 లక్షలకోట్లనుంచి తగ్గించింది. ఏప్రిల్‌నెలలో రూ.1.03 లక్షలకోట్లు, మేనెలలో 94చ,016 కోట్లు, జూన్‌లో 96,483 కోట్లు, జులైలో 93,960 కోట్లు, ఆగస్టులో 94,442కోట్లు, సెప్టెంబరులో 1,00,710 కోట్లు, అక్టోబరులో 97,637 కోట్లు, నవంబరులో 94,725కోట్లు, డిసెంబరులో 1.02 లక్షలకోట్లు వసూళ్లున్నాయి. వచ్చే ఆర్ధికసంవత్సరానికి జిఎస్‌టి రాబడుల లక్ష్యం 13.71 లక్షలకోట్లుగా గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

https://www.vaartha.com/news/business/  
మరిన్ని తాజా వార్తల కోసం బిజినెస్‌ క్లిక్‌ చేయండి :