ఐషర్‌ మోటార్స్‌ డౌన్‌, హాథవే అప్‌

EICHER
EICHER

ఐషర్‌ మోటార్స్‌ డౌన్‌, హాథవే అప్‌

న్యూఢిల్లీ: కొంతమంది ఉద్యో గులు గత నెల 24నుంచి సంస్థలో పనిచేయ డం లేదని, అందువల్ల ఉత్పత్తి క్షీణిస్తున్నట్లు ఆటో రంగ సంస్థ ఐషర్‌ మోటార్స్‌ తాజాగా తెలిపింది. దీంతో గత నెలలోరాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మోటార్‌ సైకిళ్ల తయారీ 10,000యూనిట్ల మేర తగ్గినట్లు పేర్కొంది. చెన్నై దగ్గరలోని ఒరగడమ్‌ ఫ్యాక్టరీలో ఉత్పత్తి తగ్గినట్లు తెలియచేసింది. దీంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు మొదట ఒకదశలో రూ.23,083 కిందికి జారింది. ఇది 52 వారాల కనిష్టంకాగా, ప్రస్తుం 6.2 శాతం క్షీణించి రూ.23,224వద్ద ట్రేడవుతోంది. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేబుల్‌ టివి సర్వీసుల సంస్థ హాథవే కేబుల్‌ను ప్రైవేట్‌ రంగ డైవర్సిఫైడ్‌ కంపెనీ ఆర్‌ఐఎల్‌ టేకోవర్‌ చేయనున్నట్లు తెలియడంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 5.5శాతం పెరిగింది. గిగాఫైబర్‌ హైస్పీడ్‌ హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను వాణిజ్య ప్రాతిపదికన వేగవంతంగా ప్రవేశపెట్టేందుకు వీలుగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ హాథవే కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.