రూ.4025కోట్ల భూషణ్‌ స్టీల్‌ ఆస్తుల జప్తు

bhushan steel
bhushan steel

న్యూఢిల్లీ: బ్యాంకుమోసాలకు సంబంధించిన కేసులో భూషణ్‌పవర్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీకి చెందిన నాలుగువేల కోట్ల విలువైన ఆస్తులను అధికారులు స్వాధీనంచేసుకున్నారు. మొత్తం విలువలపరంగాచూస్తే జప్తుకు 4025.23కోట్లవరకూ వచ్చినట్లు తేలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రెండురోజులక్రితమే కంపెనీ అవకతవకలకు సంబంధించినకేసులో వెంటనే జప్తుచేయాలనినిర్ణయించారు. సంస్థ భూములు, భవనాలు, ప్లాంట్‌, మెషినరీలను మనీలాండరింగ్‌ నిరోధక చట్టంపరిదిలో జప్తుచేసినట్లు వెల్లడించారు. ఒడిశాలో ఉన్న ఈ మొత్తం ఆస్తులవిలువ 4025.23 కోట్లుగా ఉంది. ఈకేసులో ఇదే మొదటి ఆస్తులజప్తుగా నిలిచింది. భూషణ్‌పవర్‌స్టీల్‌సంస్థ వివిధ విధానాల్లో తీసుకున్న రుణాలను బదలాయించి బ్యాంకులకు రుణాలను ఎగవేసిందని ఇడి అధికారులు గుర్తించారు. 695.14 కోట్ల రూపాయలు సంజ§్‌ుసింగాల్‌ కంపెనీ సిఎండిగా ఉన్న కాలంలో ఆయన కుటుంబసభ్యులు మొత్తంకలిపి బిపిఎస్‌ల్‌లో చూపించారు. కృత్రిమంగా సమీకరించిన దీర్ఘకాలిక మూలధన లబ్దిగా చూపించి బ్యాంకు రుణాలను బదలాయించినట్లు తేలింది.ఎల్‌టిసిజికి ఆదాయపు పన్ను మినహాయింపులున్నాయి.

ఇడి అధికారులు మనీలాండరింగ్‌కేసును దాఖలుచేసారు. సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ను రిజిస్టరుచేయడంతో ఆఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా సంజ§్‌ుసింఘాల్‌, మరికొందరిపై అవినీతి ఆరోపణలతో కేసు నమోదుచేసారు. బిపిఎస్‌ఎల్‌ ఆర్‌టిజిఎస్‌ విధానంలో వివిధ సంస్థలకు చెల్లింపులు జరిపిందని, బోగస్‌ కొనుగోళ్ల రూపంలో ఈచెల్లింపులు జరిపిందని, భారీ యంత్రాలనుకొనుగోలుచేసినట్లు చూపించిందన్నారు. చిన్నచిన్నస్టాక్స్‌ ధరలనువిపరీతంగాపెంచి కొనుగోలుచేసి తిరిగి అమ్మకం చేయడం వంటి వాటిపై కృత్రిమ ఎల్‌ఎటిసిజిని సృష్టించి రుణమొత్తాలను బదలాయించినట్లు తేలింది. మరో 3300 కోట్లు ఈక్విటీ మూలధనంగా ప్రనమోటర్‌కంపెనీలు పెట్టుబడులుపెట్టినట్లు తేలింది. బిపిఎస్‌ఎల్‌ కంపెనీ అడ్వాన్సులరూపంలో వివిధ డొల్ల కంపెనీలను నిర్వహించి వాటికి చెల్లింపులుజరిపింది. కేవలం వివిధ డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఈ కంపెనీలనునిర్వహించినట్లు గుర్తించింది. ఈకేసులో వివిద లాబాదేవీలద్వారా వచ్చిన సొమ్మును ఈక్విటీకింద చూపించి డెట్‌ ఈక్విటీ నిష్పత్తికి అనుగుణంగా చూపిస్తూ అవినీతికి పాల్పడినట్లు ఇడి అధికారులు గుర్తించారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/