హీరా గ్రూప్‌ కుంభకోణంలో విచారణ వేగవంతం

Nowhera Shaikh
Nowhera Shaikh

హీరా కుంభకోణంపై ఈడి తన దర్యాప్తును ముమ్మరం చేస్తుంది. సుమారు మూడు వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడి జ్యూడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న హీరా గ్రూప్‌ సీఈఓ నౌహిరా షేక్‌తో పాటు ఆ సంస్థ ప్రతినిధులైన బిజుథామస్‌, మోజు థామస్‌లను నాంపల్లి కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుంది. ఆ ముగ్గురిని ఈడి వారం పాటు విచారించనుంది.
హీరా గ్రూప్‌ల్లో పెట్టుబడి పెట్టిన వారిలో బినామీలున్నారని, మనీ ల్యాండరింగ్‌లో భాగంగానే వారు పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడి ఆ వివరాలను రాబట్టే ప్రయత్నం చేయనుంది. కాగా మొత్తం దేశవ్యాప్తంగా లక్షా 72 వేల 114 మంది డిపాజిట్లు చేసినట్లు ఈడి విచారణలో తేలింది. పెట్టుబడిదారులను మోసం చేసేందుకు హీరా గ్రూప్‌ తెరతీసిందని, తిరిగి చెల్లింపుల కోసం సంస్థ ఆలోచించలేదని ఈ నేపథ్యంలోనే డిపాజిట్లను బినామీ పేర్ల మీదకు మళ్లించారని ఈడి తెలిపింది. ఈ నేపథ్యంలోనే నిధుల మళ్లింపుతో ఇతర ఆస్థులు కొనుగోలు చేశారని వాటితో సుమారు 24 సంస్థలు ఏర్పాటు చేసి వేర్వేరు బ్యాంకుల్లో 182 ఖాతాలు తెరిచారు. దీంతోపాటు విదేశాల్లో కూడ మరో అకౌంట్స్‌ ఓపెన్‌ చేశారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/