డిఎక్స్‌సి టెక్‌లో 10వేల మందికి అవకాశాలు

dxc
dxc

బెంగళూరు: యుఎస్‌కు చెందిన డిఎక్స్‌సి టెక్నాలజీ భారత్‌లో 10 వేల మంది ఉపాధి కల్పించాలని ప్రణాళిక సిద్ధం చేస్తోంది. డిజిటల్‌ టెక్నాలజీపై పట్టున్న అభ్యర్థులకు ఈ అవకాశాలు కల్పించనుంది. కంపెనీలో మార్పులు చేసి ఈ పోటీని తట్టుకునేట్లు చేయడానికి ఈ వ్యూహానికి పదును పెడుతోంది. మేము డిజిటల్‌ స్కిల్స్‌పై దృష్టిపెట్టాము. ఈ క్రమంలో భారత్‌లో ఈ ఏడాది దాదాపు 10 వేల మందికి ఉద్యోగం కల్పించే అవకాశముంది. డిఎక్స్‌సి ఇందుకోసం ఇప్పటికే డిజిటల్‌ నేటివిటీ పరీక్షను నిర్వహించింది. వివిధ క్యాంపసుల్లో ఇప్పటికే 1500మందిని సెలెక్ట్‌ చేసుకుందని డిఎక్స్‌సి డెలివరీ అండ్‌ ఆపరేషన్స్‌ విభాగాధిపతి శామ్సన్‌ డేవిడ్‌ వెల్లడించారు. 2017లో సిఎస్‌సి, హెచ్‌పి విలీనం తర్వాత ఈ సంస్థ అవతరించింది. అమెరికా బయట వ్యాపారాన్ని విస్తరిస్తున్న సంస్థల జాబితాలో ఇది కూడా ఉంది. ప్రధానంగా భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ప్రతిభావంతుల కోసం వెతుకుతున్నామన్నారు. గత నవంబర్లో కంపెనీ సిఇఒ జాన్‌ మిషెల్‌ లారీ మాట్లాడుతూ ఉద్యోగుల కొరత వల్ల సంస్థ దాదాపు 100 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని కోల్పోవలసి వచ్చిందని వెల్లడించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/international-news/