సవాళ్లపై సవారీ!

Dr.Reddy's Lab
Dr.Reddy’s Lab

సవాళ్లపై సవారీ!

న్యూఢిల్లీ: డాక్టర్‌ రెడ్డీస్‌ లాబొరేటీస్‌ కష్టకాలం నుంచి కోలుకుంటోంది. దేశీయ మార్కెట్లో కలిసొచ్చినప్పటికీ విదేశీ మార్కెట్లలో నిలబెట్టుకోవాల్సి ఉంది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ ఫలితాలే దెబ్బతీశాయి. ఈ సంవత్సరం కొంతమేర సంస్థకు రూ.700కోట్ల నగదు అందుబాటులోకి వచ్చింది. గత ఏడాదికంటే ఎక్కువ రావడం వల్ల కంపెనీకి కొంత కలిసొచ్చిం ది. ఆర్‌అండ్‌బి విభాగం ఖర్చులు 13శాతం తగ్గించుకున్నది. అలాగే మూలధనంపై రిటర్నులు కూడా తగ్గాయి. గతేడాది నాసాల్‌స్ట్రై ఔషధాన్ని ముందుగానే ప్రభుత్వానికి నివేదించింది.

అలాగే సుజాగ్జోన్‌ ఔషధానికి ఆమోదం లభించడం కొంత సానుకూలమయింది. డాక్టర్‌ రెడ్డీస్‌ నుంచి కోపా గ్జోన్‌ సువరింగ్‌ మందులను అమెరికా మార్కెట్లో ప్రవేశపెట్టడమే కొంత కలిసొచ్చింది. ఈ పరిణా మాల నేపథ్యంలో స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలు ఎడల్వీజ్‌ రెడ్డీస్‌ షేరు ధరను రూ.3350గా నిర్ణయించింది. యూఎస్‌ మార్కెట్లకు సంబంధించినంత వరకూ డాక్టర్‌రెడ్డీస్‌ భయాలు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నాయి. 13శాతం ధరలు తగ్గించినప్పటికీ, 19 సరికొత్త ప్రాడక్టుల ఫైలింగ్‌ కలిసి వచ్చే అంశం. అలాగే సుబగ్జోన్‌ ఔషధానికి గ్రీన్‌ సిగ్నల్‌ లభించడం, నేజల్‌ స్ప్రే అమ్మకాలకు సంబంధించిన ఫైలింగ్‌ చేయడం కలిసి వచ్చే అంశాలు. యూఎస్‌ మార్కెట్లో న్యాయ సంబంధిత పోరులో సత మతమైనప్పటికీ, డాక్టర్‌రెడ్డీస్‌ అమ్మకాలకు సంబం ధించిన ఫ్రీ క్యాష్‌ ఫ్లోలో మాత్రం ఎలాంటి తగ్గుదల లేదు.

దాదాపు 68 శాతం పెరిగింది. జిఎస్‌టి అనంతరం కూడా సేల్స్‌ 29 శాతం నుంచి 31 శాతానికి పెరిగాయి. రానున్న కాలంలో యూఎస్‌ మార్కెట్లో ప్రవేశపెట్టే జెనరిక్‌ ఔషధాలతో పాటే, ఎర్నింగ్స్‌పరంగా బలంగా కొనసాగుతున్న డాక్టర్‌ రెడ్డీస్‌కు బ§్‌ు రేటింగ్‌ ఇస్తున్నట్లు ఎడిల్వీజ్‌ తెలిపింది. మరోవైపు యూఎస్‌ మినహా మిగతా మార్కెట్లలో సైతం డాక్టర్‌ రెడ్డీస్‌ నెట్‌ రెవెన్యూ 1శాతం మేర పెరిగాయి. కంపెనీ ఆదాయంలో 80శాతం ఉన్న జెనరిక్‌ బిజినెస్‌ కూడా పెరిగింది. మరోవైపు రష్యాలోనూ, యూరోప్‌లోనూ జెనరిక్‌ మార్కెట్లో 9శాతం మేర ఆదాయం పెరిగింది. ఈ నేపథ్యంలో రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల్లో కంపెనీ 10శాతం రేటుతో వృద్ధి సాధించనుందని ఎడిల్వీజ్‌ అంచనా వేసింది.