నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

stoc market
stoc market

ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు అన్ని రంగాలు క్షీణించాయి. ప్రపంచ సంకేతాలు బలహీనంగా ఉన్న నేపథ్యంలో రోజంతా హెచ్చుతగ్గుల మధ్య కొనసాగాయి. చివరికి సెన్సెక్స్‌ 229పాయింట్లు పతనమై 40,116వద్ద నిలవగా, నిఫ్టీ 73పాయింట్లు క్షీణించి 11,840వద్ద నిలిచింది. దేశ ఔట్‌లుక్‌ను మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ స్థిరత్వం నుంచి ప్రతికూలానికి సవరించడంతో వారాంతాన ఒక్కసారిగా నీరసించిన మార్కెట్లు తర్వాత కన్సాలిడేషన్‌ బాటలో సాగుతున్న విషయం విదితమే. కాగా, అమెరికా స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగియగా, బుధవారం ట్రేడింగ్‌లో ఆసియా మార్కెట్లలో అమ్మకాలదే హవా అన్నట్లుగా సాగింది. ఎన్‌ఎస్‌ఇలో అన్ని రంగాలూ అమ్మకాలతో డీలాపడ్డాయి. ముఖ్యంగా మీడియా, పిఎస్‌యు బ్యాంకులు, మెటల్‌, రియాల్టీ 4.5-2.2శాతం మధ్య నీరసించాయి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/