ధోనీ నిర్ణయం కీలకం

MS Dhoni
MS Dhoni

్ధచెన్నై: కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని, ఆటగాళ్ల అకుంఠిత దీక్ష, పట్టుదల, వ్యూహం వల్లే పునరాగమనంలో చెన్నై సూపర్‌కింగ్‌ విజేతగా అవతరించిందని ఆ ఫ్రాంచైజీ యజమాని, పారిశ్రామిక వేత్త ఎన్‌. శ్రీనివాస్‌ అన్నారు. సంక్షోభ సమయంలో నాయకత్వం అనే అంశంపై ఐఐటీ మద్రాస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మ్యాచ్‌ఫిక్సింగ్‌, అవినీతి అరోపణలో చెన్నై సూపర్‌కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ను 2016లో నిషేధించారు. రెండేళ్ల తరువాత పునరాగమనం చేసేందుకు ఈ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. రెండేళ్ల నిషేదం రూపంలో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓ సంక్షోభం చుట్టు ముట్టింది. 2018లో రావడం రావడంతోనే జట్టు విజేతగా అవతరించింది. సంక్షోభం దేన్నైనా చుట్టుకోవచ్చు. కానీ ఎంఎస్‌ ధోనీ, చెన్పైసూపర్‌కింగ్స్‌ గానిని అకుంఠిత దీక్ష, మొక్కవోని పట్టుదల, పక్కాప్రణాళికతో అధిగమించింది. ఎలాంటి సమయంలోనైనా అసాధారణ పరిస్థితి రావచ్చు. వ్యక్తులు, కార్పొరేట్‌, రాజకీయాలు, పార్టీలు, ఏ రంగంలోనైనా సంక్షోభం తలెత్తోచ్చు. దానిని సవాల్‌గా స్వీకరించి ముందుకు నడవాలి.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/