తగ్గిన అశోక్‌ లేలాండ్‌ లాభం

ashok leyland
ashok leyland

న్యూఢిల్లీ: హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రధాన కంపెనీ అశోక్‌లేలాండ్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు క్వార్టర్లో 93శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.. 528 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.. 39 కోట్లకు తగ్గిందని అశోక్‌ లేలాండ్‌ తెలిపింది. ఆదాయం రూ.. 7,621 కోట్ల నుంచి 48శాతం తగ్గి రూ. 3,939 కోట్లకు చేరిందని కంపెనీ చైర్మ్‌న్‌ ధీరజ్‌ జి. హిందుజా తెలిపారు. వాహన పరిశ్రమ అమ్మకాలు ఈ క్యూలో 53 శాతం మేర తగ్గాయని ధీరజ్‌ హిందుజా పేర్కొన్నారు. ఈ క్యూ2లో తమ కంపెనీ అమ్మకాలు గణనీయంగానే తగ్గినప్పటికీ, 5.8శాతం నిర్వహణ లాభ మార్జిన్‌ సాధించామని తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/
్జ