డిజిటల్‌ చెల్లింపుల్లో డెబిట్‌కార్డులే కీలకం!

debit cards
debit cards

ముంబయి: డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థలో డెబిట్‌కార్డులే కీలకంగా మారాయి. ఏప్రిల్‌నెలలో మొత్తం 1.21 బిలియన్‌లమేర లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.3.39 లక్షలకోట్లుగా ఉంది. ఈ మొత్తంలో 808.91 మిలియన్‌ లావాదేవీలు 2.84 లక్షలకోట్లుగా ఉనఆ్నయి. వీటిని ఎటిఎంలద్వారా నిర్వహించినట్లు తేలింది. మిగిలిన లావాదేవీలు పాయింట్‌ఆఫ్‌సేల్‌ టెర్మినల్స్‌సాయంతోనిర్వహించారు. మొత్తంగాచూస్తే 14.27 బిలియన్‌ల డెబిట్‌కార్డుల ఆధారిత లావాదేవీలు జరిగాయి. అంతకుముందు సంవత్సరంతోపోలిస్తే 19.4శాతంపెరిగాయి. వీటి విలువ కూడా 16.2శాతం పెరిగింది. 39.04 లక్షల కోట్లుగా ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి.

డిజిటల్‌చెల్లింపుల్లో డెబిట్‌కార్డు అత్యంత కీలకంగా మారింది. నగదురహిత లావాదేవీలో భారీగా పెరుగుతున్నందున డెబిట్‌కార్డుల సాయంతోజరిగే లావాదేవీలు ఎక్కువని సర్వత్రా టెక్నాలజీస్‌ వ్యవస్థాపకుడు మందార్‌ అగాషే వెల్లడించారు. డెబిట్‌కార్డులు కేవలం నగదు విత్‌డ్రాకే వినియోగించేవారని ఇపుడు అన్ని లావాదేవీలకు వినియోగిస్తున్నారన్నారు జన్‌ధన్‌కాతాలు రావడం, కిసాన్‌క్రెడిట్‌కార్డులు వంటివి ఇపుడు ఎక్కువ ఉన్నాయి. ఇ-కామర్స్‌ పోర్టళ్లలో చెల్లింపులు, కొనుగోళ్లకు చెల్లింపులు డెబిట్‌కార్డులసాయంతోనే నడుస్తున్నాయని ఆయన అన్నారు. ఇక ఆర్‌టిజిఎస్‌ లావాదేవీలు 7.7శాతంపెరిగి ఏప్రిల్‌లో 11.48 మిలియన్లకు చేరాయి. వార్షికపద్ధతిలో 16.9శాతం పెరిగి వీటి విలువ 1715 లక్షలకోట్లుగా ఉన్నాయని వెల్లడించారు.

ఇక నెఫ్ట్‌ విధానంలో లావాదేవీలు 20.454లక్షలకోట్ల విలువైనవి జరిగినట్లు సమాచారం. 167.35 మిలియన్ల లావాదేవీలు 16.32 లక్షలకోట్ల విలువైనవి గత ఏడాదే జరిగాయి. రెండులక్షల కుపైబడిన లావాదేవీలన్నీ ఆర్‌టిజిఎస్‌ ద్వారా జరుగుతాయి. గరిష్టపరిమితి లేకుండా ఎం తైనా పంపించుకోవచ్చు. నెఫ్ట్‌ద్వారా కూడా ఎలాంటి పరిమితులు లేవు. మొత్తం 378.87మిలియన్ల మొబైల్‌వ్యాలెట్‌ కేంద్రంగాజరిగే లావాదేవీలున్నాయి. 15,548 కోట్ల మేర లావాదేవీలు ఒక్క ఏప్రిల్‌లోనే జరిగాయి. అంతకుముందు ఏడాది 279.29 మిలియన్‌ లావా దేవీలు 11,695 కోట్ల వరకూ జరిగినట్లు సర్వత్రా టెక్నాలజీస్‌ వెల్లడించింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/