భారత్‌ ఆర్ధికవృద్ధి 6.8% మాత్రమే!

economy growth
economy growth

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్ధికవృద్ధి 2020 ఆర్ధికసంవత్సరంలో 6.8శాతం వరకూ మాత్రమే ఉంటుందని, ఆర్ధికవృద్ధిలో మందగమనం చోఒటుచేసుకుందని డిబిఎస్‌ బ్యాంకు విశ్లేషించింది. అంతకుముందు ఆర్ధికవృద్ధి 7శాతంగా ఉంటుందని అంచనావేసిన బ్యాంకు ఎగుమతుల్లో కొంత తిరోగమనం వాణిజ్యరంగం సవాళ్లతోకూడిన నడక వంటివి కొంత భారం అవుతాయని వెల్లడించింది. ప్రభుత్వ విధివిధానాలు కూడా కొంత తోడవుతాయని, మానిటరీపాలసీ ఎక్కువగా ప్రభావితంచేస్తుందని బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. భారతీయ రిజర్వుబ్యాంకు విధాన వైఖరి తటస్థవైఖరినుంచి కొంత సానుకూలంగా మారింది.

దీనివల్ల కొంత నగదు ప్రభావం పెరుగుతుందని డిబిఎస్‌గ్రూప్‌ ఆర్ధికవేత్త రాధికారావు వెల్లడించారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ 75 బేసిస్‌పాయింట్ల రెపోరేట్‌తగ్గిచడం వల్ల కొంతపరిస్థితుల్లో మార్పు వస్తుందన్నారు. వాస్తవ జిడిపి అంచనాలు 6.8శాతంవరకూ మాత్రమే ఉంటాయని బ్యాంకు వెల్లడించింది. డిమాండ్‌పరంగా ద్రవ్యోల్బణ సమస్యలు ఉంటాయని, కీలకద్రవ్యోల్బణం రిటైల్‌ద్రవ్యోల్బణం కొంతమేర దిగువకు రావచ్చన్న అంచనాలను వ్యక్తంచేసింది. కీలకద్రవ్యోల్బణం ఆరుశాతం సగటునుంచి మేనెలలో 4.2శాతంగా నిలిచింది. ప్రస్తుత ఆర్ధికవృద్ధి మందగమనం వల్ల ఈఏడాది మరింతగా వడ్డీరేట్ల కోత ఉంటుందని చెపుతున్నారు. ద్రవ్యోల్బణం 3.4 శాతంనుంచి 3.8శాతానికి వస్తుందని, ఆర్ధికవృద్ధి మందగమనం, ద్రవ్యోల్బణ ప్రభావాలు కొంతకారణం అవుతాయని డిబిఎస్‌బ్యాంకు వెల్లడించింది.

అంతర్జాతీయ ధోరణులు కూడా ఆర్‌బిఐ పాలసీకి కొంత కీలకం అవుతాయని వెల్లడించారు. అమెరికా ఫెడ్‌రిజర్వు యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకులతోపాటు ఇతర ఆసియా కేంద్ర బ్యాంకులు భారత్‌తోపాటు భవిష్యత్తులో కొంత సడలింపులు ఇవ్వక తప్పదని డిబిఎస్‌ బ్యాంకు ఆర్ధికవేత్తలు చెపుతున్నారు. ఇక ముడిచమురుధరలు గరిష్టస్థాయినుంచి కొంత దిగివచ్చాయి. అంతర్జాతీయ దిగుబడులు 2012 -2013తో పోలిస్తే భారత్‌ కొంతమెరుగుపడింది. ప్రస్తుతం భారత రూపాయి కొంత ఒత్తిడికి లోనవుతోంది.

ద్రవ్యోల్బణం రెండంకెల్లో పెరిగే అవకాశం ఉందని అందువల్లనే రిజర్వుబ్యాంకుకు పాలసి విధాననిర్ణయం కొంత సవాళ్లతో కూడుకున్నదవుతుందని వెల్లడించారు. ద్రవ్యోల్బణం అంచనాల లక్ష్యానికి దిగువనే ఉన్నప్పటికీ రూపాయి కరెన్సీ మాత్రం మరింతగా క్షీణిస్తున్నదని, దీనివల్ల ఆర్ధికవృద్ధికోసం లోటు భర్తీకోసం అయినా 2020 ఆర్ధికసంవత్సరంలో మరో 50 బేసిస్‌పాయింట్లు వడ్డీరేట్ల కోత ఉంటుందని చెప్పారు. రానున్న కాలంలో రెపోరేటు 5.25శాతంగా ఉండవచ్చని డిబిఎస్‌బ్యాంకు ఆర్ధికవేత్త రాధికారావు వెల్లడించారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/