20 నుంచి సిపిఎస్‌ఇ ఇటిఎఫ్‌!

ETF
ETF


న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగసంస్థల ఎక్ఛేంజి ట్రేడెడ్‌ఫండ్‌ వచ్చే వారం ఇన్వెస్టర్లకోసం మళ్లీప్రారంబం అవుతోంది. 2014లో ప్రారంభించిన సిపిఎస్‌ఇ ఇటిఎప్‌ మూడు విడతలుగా కొనసాగింది. ప్రస్తుతం నాలుగోదశలోనికి వచ్చింది. మొత్తం 11 ప్రభుత్వరంగ సంస్థలు, ఉన్నాయి. వీటిలో ఒఎన్‌జిసి, ఎన్‌టిపిసి, కోల్‌ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ సంస్థలే 77శాతం ఇటిఎప్‌లో భాగస్వాములయ్యాయి. రిలయన్స్‌ నిప్పన్‌ ఎఎంసి పర్యవేక్షిస్తున్న ఇటిఎప్‌లో ఇన్వెస్టర్లుకు నాలుగుశాతం డిస్కౌంట్‌కూడా అందిస్తునఆనరు. మార్కెట్‌ధరలకు అనుగుణంగా ఈ డిస్కౌంట్‌ ఉంటుంది.

ఒకరోజు పూర్తిస్థాయిలో జరిగిన మార్కెట్‌ధరలకు అనుగుణంగా రిఫరెన్స్‌మార్కెట్‌ధరను నిర్ణయిస్తారు నిఫ్టీ సిపిఎస్‌ఇ సూచీ ఎన్‌ఎస్‌ఇలో మార్చి 20, 22 తేదీల్లో ఉంటుంది. ఆఫర్‌ యాంకర్‌ ఇన్వెస్టర్లకు మారి 19వ తేదీన తెరుస్తారు. ఇక ఇతర ఇన్వెస్టర్లకు రిటైల్‌ఇన్వెస్టర్లు, దేశీయ ఇన్వెస్టర్లు వంటివారికి మార్చి 20వ తేదీప్రారంభిస్తారు. మార్చి 22వ తేదీ మూసేస్తారు. ప్రాథమిక ప్రారంభంలో ఐదుశాతం డిస్కౌంట్‌ లభిస్తుంది. బోనస్‌ యూనిట్లు కూడా ఉంటాయి. ఒకేడాదికి మించి ఇటిఎఫ్‌ను రన్‌చేస్తేనే వారికి బోనస్‌ యూనిట్లుఇస్తారు. ఇన్వెస్టర్లు వరుసగామూడు ఆఫర్లలో కొనుగోలుచేస్తే వారికి ఐదు శాతం, 3.5శాతం, 4.5శాతం డిస్కౌంట్లు అందుతాయి.

మొత్తం 11 కంపెనీల్లో నాలుగు కంపెనీలు ఒఎన్‌జిసి, ఎన్‌టిపిసి, కోల్‌ ఇండియా, ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీలు ఇటిఎఫ్‌లో 77శాతం ఉన్నాయి. మరికొన్ని పిఎస్‌యులు గెయిల్‌, ఎన్‌టిపిసి, కంటైనర్‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండి, ఇంజనీర్స్‌ ఇండియా వంటిసంస్థలు ఉపసంహరించుకున్నాయి. ఇతర సంస్థలు నైవేలి లిగ్నైట్‌కార్ప్‌, ఎస్‌జెవిఎన్‌, ఎన్‌బిసిసి వంటివి ఇటిఎఫ్‌కు తోడయ్యాయి. ఫిబ్రవరి28వ తేదీనుంచి సిపిఎస్‌ఇ ఇటిఎఫ్‌ ఆకర్షనీయంగా ట్రేడ్‌ అవుతోంది. ఈ సూచీ 5.52శాతంగా ఉంది. చెపుతున్నారు.