బ్యాంకులకు వరుస సెలవులే!

banks
banks


ముంబై: ఏప్రిల్‌ నెలలో బ్యాంకు లావాదేవీలు వంటి పనులను ముందుగానే ప్లాన్‌ చేసుకోండి. ఎందుకంటే పండగల కారణంగా వరుస సెలవులు వస్తున్నాయి. బిజినెస్‌ వ్యవహారాలు, చెక్స్‌ డిపాజిట్స్‌, డిడిలు జమాయచేయడం వంటివి ముందుగానే చేయడం మంచిది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రెండు, నాలుగో శనివారాలు అంటే ఏప్రిల్‌ 13,27 తేదీలు బ్యాంకులు మూసివేయబడతాయి. వీటికి తోడుగా ఆదివారాలు 1, 14, 21, 28 తేదీలు కూడా సెలవు. వీటితోపాటు ఏప్రిల్‌ 5 శుక్రవారం బాబు జగ్జీవన్‌ రామ్‌ జయంతి, ఏప్రిల్‌ 6న శనివారం ఉగాది, 7 ఆదివారం మూడు రోజులు వరుసగా సెలవులు. 19న గుడ్‌ప్రైడే కాబట్టి సెలవు. ఈ రోజుల్లో బ్యాంకులు పనిచేయవు. అయితే నెట్‌ బ్యాంకింగ్‌ సేవలకు మాత్రం ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆన్‌లైన్‌, డిజిటల్‌ లావాదేవీలు జరుగుతాయి. కాబట్టి ఖాతాదారులు ఆన్‌లైన్‌ ద్వారా సేవలు వినియోగించుకోవచ్చు. మిగతా లావాదేవీ వ్యవహారాల సెలవులకు తగ్గట్లుగా ప్లాన్‌ చేసుకోవడం మంచిది.

తాజా యాత్ర వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/tours/