కోల్‌ ఇండియా డివిడెండ్‌ రూ.5.85

న్యూఢిల్లీ, : కోల్‌ ఇండియా లిమిటెడ్‌ బోర్డు తాత్కాలిక డివిడెండ్‌ ప్రతివాటాకు రూ.5.85గా నిర్ణయించింది. దేశంలోని బొగ్గు ఉత్పత్తిలో కోల్‌ ఇండియా 80శాతం ఉత్పత్తిచేస్తున్నది. 2018-19 ఆర్ధిక సంవత్సరానికిగాను తాత్కాలిక డివిడెండ్‌ను 5.85గా ప్రకటించినట్లు వెల్లడించింది. గురువారం నిర్వమించిన డైరెక్టర్లత బోర్డు సమావేశంలో రెండోవిడత తాత్కాలిక డివిడెండ్‌ 5.85గా నిర్ణయించింది. ప్రతి పదిరూపాయల ముఖవిలువ ఉన్న షేరుకు 5.85గా డివిడెండ్‌ను ఆడిట్‌కమిటీ ఆమోదించిందని ప్రభుత్వరంగ సంస్థ బిఎస్‌ఇకి ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. రెండో విడత తాత్కాలిక డివిడెండ్‌ను 2018-19సంవత్సరానికి సంబంధించినది ఈనెల 29వ తేదీనుంచి అమలుచేయనున్నట్లు వెల్లడించింది.

మరిన్ని తాజా వార్తల కోసం బిజినేస్‌ క్లిక్‌ చేయండి 
https://www.vaartha.com/news/business/