సిఎంఐ పైపైకి, స్టెరిలైట్‌ డౌన్‌

ముంబై,: ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో పిఎస్‌యు దిగ్గజాలు పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ, మజగావ్‌ డాక్‌ నుంచి వెండార్‌ అప్రూవల్‌ లభించినట్లు సిఎంఐ లిమిటెడ్‌ పేర్కొంది. దీంతో ఎక్స్‌ఎల్‌పిఇ, పివిసి పవర్‌ కేబుళ్లు, పివిసి ఇన్సులేటెడ్‌ కంట్రోల్‌ కేబుళ్లను పవర్‌గ్రిడ్‌కు, పవర్‌, కంట్రోల్‌, టెలిఫోన్‌, ఆప్టికల్‌ పైబర్‌ కేబుళ్లను ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీకి అవసరాలకు అనుగుణంగా సరఫరా చేసేందుకు అనుకూలంగా ఉన్నట్లు తెలియచేసింది. ఇదేవిధంగా మజగావ్‌ డాక్‌, జవహర్‌ లాల్‌ నెహ్రూ పోర్ట్‌ట్రస్ట్‌కు ఎలక్ట్రిక్‌ పవర్‌ కేబుళ్ల సరఫరాకు వెండార్‌ అప్రైవల్‌ లభించినట్లు తెలియచేసింది. కంపెనీలో ప్రమోటర్లకు 43.55శాతం వాటా ఉంది. దీంతో ఈ షేరు ఎన్‌ఎస్‌ఇలో 7శాతం పెరిగి రూ.159వద్ద ట్రేడవుతోంది. మొదట రూ.162వరకూ పెరిగింది. అదేవిధంగా స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ కూడా గత నెల రోజుల్లో 42 శాతం ర్యాలీచేసిన స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో దాదాపు 4 శాతం క్షీణించి రూ.248వద్ద ట్రేడవుతోంది. కాగా ఫిబ్రవరి 12న రూ.181వద్ద ఏడాది కనిష్టానికి చేరింది.

https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: