భారత ఇ-కామర్స్‌లోని యుసివెబ్‌

e-commerce
e-commerce

న్యూఢిల్లీ: చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్‌ తాజాగా భారత ఇ-కామర్స్‌ వ్యాపార విభాగంలో ప్రవేశించాలని యోచిస్తోంది. అనుబంధ సంస్థ యుసివెబ్‌ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలోనే వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తోంది. యుసివెబ్‌ గ్లోబల్‌ బిజినెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హుయాన్‌ యాంగ్‌ ఈ విషయాలు తెలిపారు. అయితే, ఇ-కామర్స్‌ విభాగంలోకి తమ ఎంట్రీతో పేటిఎంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని ఆయన తెలిపారు. ఇ-కామర్స్‌ చాలా విస్తృతమైనదని, తమకు అనుకూల వ్యాపారరంగంతో తగిన ఉత్పత్తుల విభాగాలను ఎంచుకుంటామని, పేటిఎంతో పోటీపడబోమని యాంగ్‌ అలీబాబా గ్రూప్‌నకు పేటిఎంలో 30.15శాతం, మరో ఇ-కామర్స్‌ సంస్థ స్నాప్‌డీల్‌లో 3 శాతం వాటాలు ఉన్నాయి. యుసివెబ్‌ ఆన్‌లైన్లో సినిమాల విక్రయం కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు యాంగ్‌ వెల్లడించారు. యుసివెబ్‌నకు చెందిన యుసి బ్రౌజర్‌ 2009 నుంచి భారత్‌లో అందుబాటులో ఉంది. యుసివెబ్‌ వర్గాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 110మంది యూజర్లు ఈ బ్రౌజర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోగా, ఇందులో సగభాగం యూజర్లు భారత్‌ నుంచే ఉన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/