చైనా 6జీ పై ముందు చూపు

6g
6g

హైదరాబాద్‌: వేగంవంతమైన మొబైల్‌ డేటాను అందించడంలో చైనా దేశం బులెట్‌ వేగంతో దూసుకుపోతుంది. ఈ మధ్యకాలంలో 5జీ సేవలను ప్రారంభించిన ఆ దేశం అప్పుడే 6జీపై గాలం విసిరింది. 6జీ టెక్నాలజీ అభివృద్ధి, పరిశోధనలకు సంబంధించిన పనులు ప్రారంభించిదని ఆ దేశ మీడియా తెలిపింది. దీనికి సంబంధించి సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఇటీవలి సమావేశమైంది. 6జీ అభివృద్ధి, పరిశోధనకు రెండు గ్రూపులను నెలకొల్పుతున్నట్లు ప్రకటించింది. నూతన వైర్‌లెస్‌ టెక్నాలజీని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పరిశోధనలు జరగనున్నాయని తెలిపింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/