చెన్నై మెట్రో రెడీ

METRO111
METRO

చెన్నై మెట్రో రెడీ

చెన్నై: 2019-20 బడ్జెట్‌ ఎస్టి మేట్‌ను తమిళనాడు ప్రభుత్వం చెన్నై మెట్రోరైల్‌ ప్రాజెక్టుకు 2681కోట్ల రూపాయలను కేటా యించింది. తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి శ్రీ ఒ.పన్నీర్‌ సెల్వం మాట్లాడుతూ చెన్నై మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు మొదటి దశ 45.01కి.మీటర్లు ఉన్నదని ఈ నెలలో ప్రారంభ మవుతుందని రెండు కారిడార్లలో మెట్రో రైల్‌ రాకపోకలు కొనసాగిస్తుం దని చెప్పారు. 2020 జూన్‌ నాటికి 9 కి.మీ పోడవున తరువట్రైవూర్‌, విముకోనగర్‌ మధ్య మెట్రోరైల్‌ ప్రారంభమవు తుందని అన్నారు. 2018-19 సంవత్సరం బడ్జెట్‌లో 1,950 కోట్ల ప్రాజెక్టు కోసం కేటా యించారు. మెట్రో రైలు మీనంబాకం ఏయిర్‌ పోర్ట్‌ నుంచి కిలంబక్కం మెట్రోబస్‌ టర్మీనల్‌ వరకు విస్తరించేందుకు సాధ్యాసాధ్యాల అధ్య యనం కొనసాగుతున్నదని అన్నారు. చెన్నై మెట్రోరైల్‌ మొత్తం 118.90కి.మీటర్ల పొడవున నిర్మాణం అవుతున్నది. జపాన్‌ ఇంటర్నేషనల్‌ కో-ఆపరేషన్‌ ఎజెన్సీ మూడు మార్గాలలో మెట్రో ను నిర్మిస్తున్నది. మాదవరం నుంచి శోలింగన లూర్‌ వరకు మాదవరం నుంచి చెన్నై బస్‌ టెర్మినల్‌ వరకు మొత్తం 52.01కి.మీల మార్గం కోసం 20,196కోట్లు ఖర్చు అవుతున్నది. మొత్తం 40,491కోట్లు ఈ ప్రాజెక్టు ఎస్టిమేషన్‌. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి మంజూరు చేసింది. మిగతా ఏమైనా నిధులు అవసరం అయినచోట, లేదా విస్తరణ కార్యక్ర మాల కోసం నిధుల సమీకరణ కొనసాగుతుంది.