బోయింగ్ 737 మాక్స్‌లో మార్పులు!

న్యూఢిల్లీ, : 737 మాక్స్ విమానాల్లో బోయింగ్ కొన్ని మార్పులు చేపట్టింది. ఈ విషయాన్ని ఆ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ విమానాల్లో బోయింగ్ ఒక హెచ్చరిక వ్యవస్థను అమర్చనుంది. గతంలో ఈ వ్యవస్థను ఒక ఆప్షనల్‌గా మాత్రమే అందచేసేది. ఈ వ్యవస్థ గతంలో ప్రమాదానికి గురైన లయన్ ఎయిర్ విమానంలో గానీ, ఇథియోపియా విమానంలో కానీ లేదు. స్టాల్ వ్యవస్థ ఎప్పుడైతే వ్యతిరేక సంకేతాలను పంపిస్తుందో, అప్పుడు ఇది హెచ్చరికలు జారీచేస్తుంది. ఈ వ్యవస్థను ఫ్రీగా అమర్చనుంది. దీంతోపాటు ప్రమాదానికి కారణమైన సాఫ్ట్‌వేర్‌ను బోయింగ్ తాజాగా అప్‌గ్రేడ్ చేయనుంది. ఎంకాన్ వ్యవస్థ నుంచి వచ్చే సంకేతతాలను, సెన్సర్ల నుంచి వచ్చే సంకేతాలకు మధ్య తేడాలు ఉంటే ఈ కొత్త సాఫ్ట్వేర్ రంగంలోకి దిగుతుంది. వెంటనే ఎంకాన్ వ్యవస్థను డిజేబుల్ చేస్తుంది. గతంలోజరిగిన రెండు ప్రమాదాలు విమానాల్లోని ఎంకాన్ వ్యవస్థ కారణంగా జరిగినట్లు దర్యాప్తు బృందాలు భావిస్తున్నాయి.
మరిన్ని తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: