సిజి పవర్‌పై రుణదాతల కన్ను?

ముంబై, : ఇటీవల ర్యాలీబాటలో సాగుతున్న సీజి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీయల్‌ సొల్యూషన్స్‌ షేరు వెలుగులోకి వచించది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో ఈ షేరు 4 శాతం పెరిగి రూ.44వద్ద ట్రేడవుతోంది. దీంతో ఫిబ్రవరిలో నమోదైన 52 వారాల కనిష్టం నుంచి 106 శాతం జోరందుకుంది. పిఇ సంస్థ కెకెఆర్‌, ఎస్‌ బ్యాంకు, బిఒఐ ఎఎక్స్‌ఎ తదితర సంస్థలు సిజి పవర్‌లో నియంత్రిత వాటాను సొంతం చేసుకునే యోచనలో ఉన్నట్లు వెలువడ్డ వార్తలు ఇందుకు ప్రధానంగా దోహదపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో గత నెల మొదట్లో సీజి పవర్‌ షేరు నీరసించింది. మూడవ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.150కోట్లనికర నష్టం ప్రకటించింది. రూ.28కోట్ల నష్టం మాత్రమే నమోదైంది.

https://www.vaartha.com/news/business/
మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: