జెట్‌ సంస్థపై విచారణకు కేంద్రం ఆదేశం

Jet Airways
Jet Airways

న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కురుకుపోయి సర్వీసులు నిలిపేసిన జెట్‌ ఎయిర్‌వేస్‌ అంశంపై కేంద్రం విచారణ చేపట్టాలని ఆదేశించినట్లు తెలస్తుంది. జెట్‌ సంస్థలో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై వీలైనంత త్వరగా విచారణ జరిపి నివేదిక సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌(ఎస్‌ఎఫ్‌ఏవో)ను కోరినట్లు సమాచారం. దేశంలోని అత్యున్నతంగా సర్వీసులను నడిపిన ఈ సంస్థకు ఇప్పడు ఇలాంటి పరిస్థితెందుకు తలెత్తిందో కనిపెట్టాలని సూచించింది. కానీ ఈ నిధుల దుర్వినియోగం ఎవరు చేశారనే పేర్లు మాత్రం వెల్లడించలేదు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/