ఫ్లిప్‌కార్ట్‌ మెగాసేల్‌లో బంపర్‌ ఆఫర్లు!

flipkart
flipkart

న్యూఢిల్లీ: ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ జూన్‌ 1 నుంచి మరో కొత్త ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌ ఫ్లిప్‌స్టార్ట్‌ డేస్‌ పేరుతో నేటి నుంచి జూన్‌ 3 వరకు భారీ డిస్కౌంట్లు అందచేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ వస్తువులపైనే డిస్కౌట్లు ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. హెడ్‌సెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, పవర్‌ బ్యాంకులు, మొబైల్‌ కేస్‌లు తదితర వస్తువులపై 80 శాతం వరకూ డిస్కౌంట్‌ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది. ఇక, సోనీ, జెబిఎల్‌ వంటి హెడ్‌సెట్లు, స్పీకర్లపై 70శాతం వరకు రాయితీ లభిస్తుంది. హెచ్‌పి, ఏసర్‌ తదితర ల్యాప్‌టాప్‌ల ధర రూ.13వేల నుంచిప్రారంభం కానుంది. పవర్‌ బ్యాంకులు, మొబైల్‌ కేస్‌లు, ఇతర మొబైల్‌ ఉపకరణాల ప్రారంభ ధర మినిమ§్‌ు రూ.99నుంచి ఉంటుందని సంస్థ తెలిపింది. మరోవైపు నోకాస్ట్‌ ఇఎంఐ, వారంటీ పొడిగింపు, ఎక్ఛేంజ్‌ సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. 32 అంగుళా వ్యూ స్టార్‌ హెచ్‌డి టివి రూ.12499ధరకే కొనొచ్చు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/