పెరుగుతున్న బంగారం ధరలు!

GOLD
GOLD

ఢిల్లీ: నిన్నటివరకు తగ్గుముఖం పట్టిన బంగారం ధర మళ్లీ పెరిగింది. నేడు బంగారం ధర రూ. 332 పెరిగి రూ. 39వేల మార్క్‌ను మించిపోయింది. కాగా ఢిల్లీలో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 39,299గా పలికింది. మరోపక్క వెండి ధర కూడా పెరిగి బులియన్‌ మార్కెట్‌లో వెండి కిలో ధర రూ. 46,672 పలికింది. అయితే ఈ రోజు కిలో వెండి ధరలో 676 రూపాయల పెరుగుదలను నమోదు చేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌ లో ఔన్సు బంగారం ధర రూ. 1,483 డాలర్లుగా పలికింది, అలాగే వెండి ధర 17.27 డాలర్లుగా నమోదైంది. ఆర్థిక మందగమనం, మదుపరుల పెట్టుబడులు, డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం వంటి కారణాల రిత్యా దేశీయంగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నట్లు మార్కెట్‌ వర్గాలు తెలిపాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/