బిఎస్‌ఎన్‌ఎల్‌ నష్టం 14,402 కోట్లు!

BSNL
BSNL

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని బిఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలు ఈ ఆర్ధికసంవత్సరంలో 14,202 కోట్లుగా ఉంటాయని అంచనా వేస్తోంది. ప్రభుత్వరంగంలో ఉన్న ఈ సంస్థ రాబాలపరంగా చూస్తే 19,308 కోట్లుగా ఉంటాయనిఅంచనావేసింది. టిలికాం రంగ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ లోక్‌సభలో వెల్లడించారు.మొబైల్‌ మార్కెట్‌లో గట్టిపోటీ ఎదురవుతుండటం, 4జిసేవలపైనే అందరి దృష్టి ఏర్పడటం,డేటా ఆధారితంగానే టెలికాం మార్కెట్‌ నడుస్తుండటంతో కంపెనీ నష్టాలుపెరిగాయని అంచనావేసింది. రాబడులపరంగా చూస్తే రిలయన్స్‌జియో వచ్చినతర్వాత 2016 నుంచి రాబడులు తగ్గుతూ వస్తున్నాయి.

మొబైల్‌ రంగంలో గట్టిపోటీ ఉండటంవల్లనే తక్కువధరలకు విక్రయించాల్సి వస్తోంది. బిఎస్‌ఎన్‌ఎల్‌ వేతనాల ఖర్చు 75శాతం ఉంది. మొత్తం ఖర్చుల్లో 75శాతం వేతనాలే ఉనానయి. 14,488 కోట్లు వరకూ ఈ బిల్లు పెరిగింది 2015-16లో 4859 కోట్లుగాను, 2016-17లో 4793 కోట్లుగాను, 2017-18లో 7993కోట్లుగాను ఉంది. కంపెనీ రాబడులు పరంగాచూస్తే 2018-19లో 19,308 కోట్లుగా ఉంది. అంతకుముందు సంవత్సరంలో 25,071 కోట్లకంటే భారీగా తగ్గింది. 2016-17లొ 31,533 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. సేవలద్వారానే తక్కువ రాబడులుసాధిస్తోంది. దీనితో ఆర్ధికవనరులపరంగా తీవ్ర కొరతను ఎదుర్కొంటున్నది.

సిబ్బంది మొత్తం 1.76 లక్షలమంది పనిచేస్తున్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ కీలక ప్రాధాన్యేతర ఆస్తులనుకుదువపెట్టడం, లేదా నగదీకరించడం వంటి విధానాలతో కొంతపరిపుష్టినిచేకూర్చుకుంటున్నది. బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయం ఇందుకు సంబంధించి నగదీకరణకు దీపక్‌కు మొదటి విడతగా కొంత భూమిని గుర్తించి నివేదిక ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉనన భూములను కుదువపెట్టడం, లేదా నగదీకరించడం వంటివాటితో వీటి విలువలు ప్రాథమికంగానే 20 వేల కోట్లవరకూ ఉంటాయని అంచనా.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/