కీలక నిర్ణయం తీసుకున్న బోస్‌ రిటైల్స్‌

119 రిటైల్‌ దుకాణాలు మూసివేస్తున్నట్లు వెల్లడి

Bose
Bose

అమెరికా: అమెరికాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం బోస్‌ రిటైర్‌ స్టోర్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్తర అమెరికా, యూరప్‌, జపాన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలలో 119 రిటైల్‌ దుకాణాలు మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ప్రజలు ఆన్‌లైన్‌ షాపింగ్‌కు ఎక్కువగా మొగ్గుచూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఆడియో, స్పీకర్లు, హెడ్‌ఫోన్స్‌ తదితర ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తులతో బోస్‌ రిటైలర్స్‌ తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్‌ను సృష్టించుకుంది. తమ ఉత్పత్తులను దిగ్గజ కంపెనీలైన బెస్ట్‌ బై, అమెజాన్‌లు ఎక్కువ శాతం కొనుగోళ్లు చేశాయని కంపెనీ తెలిపింది. కాగా ప్రస్తుతం ప్రజలు ఆన్‌లైన్‌ షాపింగ్‌ వైపే ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/