తత్కాల్‌ టికెట్‌ బుక్‌ చేస్తున్నారా? రూల్స్‌, ఛార్జెస్‌ వివరాలు తెలుసుకోండి

న్యూఢిల్లీ,: పిల్లలకు ఎండాకాలం సెలవులు వచ్చేస్తున్నాయి. దానికి తోడు ఇది ఎన్నికల సీజన్‌. ఎన్నికల్లో ఓటు వేసేందుకు సొంతూళ్లకు వెళ్లేవారు ఎక్కువగానే ఉంటారు. సెలవులనూఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు రైళ్లు కిటకిటలాడుతుంటాయి. రద్దీ ఎక్కువే. రైలు టికెట్‌ దొరకడమే కష్టం. మరి తత్కాల్‌ టికెట్‌ ఎప్పుడు బుక్‌ చేయాలి? ఎలా బుక్‌ చేయాలి? తత్కాల్‌ టికెట్‌ బుక్‌ చేయడానికి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నియమనిబంధల్ని ఎలా అర్థం చేసుకోవాలి? తెలుసుకోండి. ఒక రైలులో ఉండే మొత్తం సీట్లలో 30 శాతం తత్కాల్‌ కోటా కోసం కేటాయిస్తారు. తత్కాల్‌ టికెట్‌ కోసం సాధారణ ఛార్జీల కన్నా కాస్త ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే తత్కాల్‌ టికెట్లు క్షణాల్లో బుక్‌ అయిపోతుంటాయి. బుకింగ్‌ సమయంలో కాస్త ఆలస్యం చేసినా టికెట్‌ దొరకదు. అందుకే తత్కాల్‌ టికెట్లు జారీ చేసే సమయాన్ని గుర్తుంచుకోవాలి. ఏసి క్లాస్‌ ఉదయం 10గంటలకు, నాన్‌ ఎసి క్లాస్‌ ఉదయం 11 గంటలకు తత్కాల్‌ టికెట్‌ బుకింగ్‌ ప్రారంభమవుతుంది. ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యుడాట్‌ఐఆర్‌సిటిసిడాట్‌కండాట్‌ఇన్‌ గానీ, ఇండియన్‌ రైల్వేస్‌ కౌంటర్లలో తత్కాల్‌ టికెట్లు బుక్‌ చేయొచ్చు. ఒక రైలులో ఉండే మొత్తం సీట్లలో 30శాతం తత్కాల్‌ కోటా కోసం కేటాయిస్తారు. ఒక పిఎన్‌ఆర్‌కు గరిషటంగా నలుగురు ప్రయాణికులకు మాత్రమే తత్కాల్‌ టికెట్లు ఇస్తారు. తత్కాల్‌ కోటాలో జనరల్‌ కోటా, లేడీస్‌ కోటా వర్తించవు. ఫస్ట్‌ ఎసి, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో తత్కాల్‌ టికెట్లు ఉండవు. తత్కాల్‌ బుకింగ్‌లో ఎలాంటి రాయితీ పొందలేరు. సెకండ్‌ క్లాస్‌ టికెట్‌కు బేసిక్‌ ఫేర్‌లో 10శాతం, మిగతా క్లాసులకు 30శాతం ఛార్జీలు వసూలు చేస్తుంది ఐఆర్‌సిటిసి. స్లీపర్‌ క్లాస్‌ టికెట్లకు రూ.100నుంచి రూ.200ఛార్జీలు ఉంటాయి. ఎసి చైర్‌ కార్‌ టికెట్‌కు రూ.125నుంచిరూ.225మధ్య ఛార్జీలు ఉంటాయి. తత్కాల్‌ టికెట్‌ క్యాన్సిల్‌ చేస్తే రీఫండ్‌ రాదు.

మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/