బోయింగ్‌కు 25 బిలియన్‌ డాలర్ల నష్టం

న్యూయార్క్‌ : బోయింగ్‌కంపెనీ విమానాలు నిలిచిపోవడంతో మార్కెట్‌ విలువలు సుమారుగా 10శాతం క్షీణించాయి. ఇథియోపియా విమానం 737 మాక్స్‌8 జెట్‌ విమానం కులిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వివిధదేశాల్లో విమానాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. 25 బిలియన్‌ డాలర్ల కంపెనీ మార్కెట్‌ విలువలు నష్టపోయినట్లు తేలింది. అమెరికా కూడా ఈ విమానాలను నిలిపివేయాలన్న నిర్ణయానికి రావడంతో మొత్తం కంపెనీ షేర్లు మూడుశాతం ఓఈణించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌కూడా శ్వేతసౌధంనుంచే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం కంపెనీని మరింత దెబ్బతీసింది. విమాన ప్రమాదంనుంచి కంపెనీ స్టాక్‌సుమారు పదిశాతం అంటే 25 బిలియన్‌ డాలర్లుమేర నష్టం జరిగిందని అంచనా. గడచిన ఐదునెలల్లోనే రెండు ఘోఒరప్రమాదాలు చోటుచేసుకోవడంతో అమెరికాసైతం విమానాలు నిలిపివేతకు ఆదేశించింది. లయన్‌ ఎయిర్‌ ఇండోనేసియాలో గత అక్టోబరులో కుప్పకూలింది. ఆదివారం ఇథియోపియా విమానం కుప్పకూలింది. వీటిలో ఏ ఒక్కరూ కూడా బతికి బైటపడ్డదాఖలాలులేవు. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌, సౌత్‌వెస్ట్‌ యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌కంపెనీలు కూడా ఈ వార్తలతో కొంతమేర దిగువస్థాయిలోనే ట్రేడింగ్‌కు పరిమితం అయ్యాయి. ఈ మూడు సంస్థలకు బోయింగ్‌ నష్టపరిహారం అందించేందుకు ముందుకువచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకూ ఈ మూడుసంస్థల్లో సుమారు 67 విమానాలు 737 మాక్స్‌ విమానాలు నిర్వహించిన సందర్భాలున్నాయి. ఏవియేషన్‌ అధికారులు కూడా ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్‌ విమానాలకు ఆర్డర్లివ్వడం నిలిపివేసారు. దీనితో బోయింగ్‌సంస్థ తనవంతు జాగ్రత్తలు తీసుకుంటున్నది. విమానాలభద్రతపై ఇపుడు దృష్టికేంద్రీకరించింది. నష్టనివారణ చర్యలను ప్రారంబించింది.

మరిన్ని తాజా వార్తల కోసం బిజినేస్‌ క్లిక్‌ చేయండి 
https://www.vaartha.com/news/business/