బుల్లెట్‌ రైలుకు టెండర్లుకు ఆహ్వానం..!

Bullet train
Bullet train

ముంబయి: హైస్పీడ్‌తో దుసుకుపోయే బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు టెండర్లును ఆహ్వానించింది. సూమారు రూ.20 వేల కోట్ల విలువైన 237 కిలోమీటర్లు పనులను ఈ టెంటర్లును ఆహ్వానించినట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు మొత్తం 508 కిలోమీటర్లలో నిర్మిస్తున్నారు. దేశంలో నిర్మిస్తున్న అతిపెద్ద సివిల్‌ ప్రాజెక్టు ఇదే. ఈ టెండర్‌ ప్రకారం ప్రాజెక్టును దాదాపు 44 నెలల్లో పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టు కోసం ఎల్‌అండ్‌టీ, ఏఎఫ్‌సీవోఎన్‌ వంటి భారీ సంస్థలు పోటీలో నిలుస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బిడ్‌లో విజయం సాధించిన కంపెనీలు జపాన్‌కు చెందిన హటాచీ కన్‌స్ట్రక్షన్స్‌, మిత్సుబిషీ కన్‌స్ట్రక్షన్స్‌తో కలిసి పనిచేయాల్సి రావచ్చు. దీంతోపాటు జపాన్‌కు చెందిన సంస్థలు కూడా ఈ బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. దీనిలో పాల్గొనే సంస్థలు రూ.200 కోట్లను సెక్యూరిటీ మొత్తంగా జమచేయాల్సి ఉంటుంది.


మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/