రూ.3 క్యారీ బ్యాగ్‌కు రూ.9వేల జరిమానా

బాటా కంపెనీకి షాక్‌

BATA
BATA

చండీగఢ్‌: బాటా ఇండియా లిమిటెడ్‌కు షాక్‌ తగిలింది. రూ.3 పేపర్‌ బ్యాక్‌ కోసం రూ.9వేల జరిమానా కట్టవలసి వచ్చింది. ఈ సంఘటన పంజాబ్‌లోని చండీగఢ్‌లో చోటు చేసుకుంది. క్యారీబ్యాగ్‌కు బలవంతంగా మూడు రూపాయల వసూలు చేసినందుకు వినియోగదారుల ఫోరం సంఘం, బాటా కంపెనీకి రూ.9వేల పైన్‌ వేసింది. చండీగఢ్‌కు చెందిన దినేష్‌ ప్రసాద్‌ రాటూరీ గత ఫిబ్రవరి అయిదో తేదీన సెక్టార్‌ 22డిలోని బాటా ఇండియా షోరూంలో బూట్లు కొనుగోలు చేశారు. మేనేజ్‌మెంట్‌ అతని వ్దద రూ.402 వసూలు చేసింది. ఇందులో బూట్లతో పాటు దినేష్‌ ప్రసాద్‌కు ఇచ్చిన పేపర్‌ బ్యాగ్‌కు రూ.3చార్జ్‌ వసూలు చేసింది. దీనిపై అతను ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్యాగ్‌పై వేసిన రూ.3తగించాలని కోరాడు. కానీ బాటా షోరూపం వారు పట్టించుకోలేదు. దీంతో వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు. బాటా కంపెనీకి కవర్‌కు రూ.3ఛార్జ్‌ వసూలు చేయడంతో పాటు ఆ బ్యాగ్‌పైన బాటా బ్రాండ్‌ను ప్రమోషన్‌ చేసుకుందని, ఇది సరికాదని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీంతో వినియోగదారుల ఫోరం, బాటాకు జరిమానా విధించింది. దినేష్‌ ప్రసాద్‌కు రూ.3 తిరిగి ఇవ్వడంతోపాటు, సేవలలో లోపానికి పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. అయితే, సేవలలో లోపాన్ని బాటా కంపెనీ అంగీకరించలేదు. అయితే బలవంతంగా పేపర్‌ బ్యాగ్‌కు రూ.3 చార్జ్‌ చేయడం సేవలలో లోపమేనని వినియోగదారుల ఫోరం స్పష్టంచేసింది. ఎవరైనా వినియోగదారులు ఉత్పత్తులు కొనుగోలు చేసినప్పుడు పేపర్‌ బ్యాగ్‌ ఉచితంగా ఇవ్వాలని పేర్కొన్నారు. దినేష్‌ ప్రసాద్‌కు పేపర్‌ బ్యాగ్‌ ధర రూ.3తోపాటు వ్యాజ్యం ఖర్చు వెయి చెల్లించాలని వినియోగదారుల ఫోరం ఆదేశించింది. అంతేకాకుండా వినియోగదారుడిని మానసిక ఆందోళనకు గురిచేసినందుకు రూ.3వేల పరిహారం, లీగల్‌ ఎయిడ్‌ నిధికి రూ.5వేలు చెల్లించాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ప్రతి వినియోగదారుడికి ఉచితంగా క్యారీ బ్యాగ్‌ అందచేయాలని ఆదేశించింది.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/