జెట్‌ ఎయిర్‌వేస్‌ బిడ్డింగ్‌కు గడువు పెంపు

jet airways
jet airways


న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌కు రుణాలిచ్చిన బ్యాంకర్లు బుధవారం మరోసారి వాటాల కొనుగోలుకు గడువుపెంచారు. ఈనెల 12వతేదీ అంటే శుక్రవారం వరకూ పొడిగించారు. నగదు సంక్షోభంలో కూరుకున్న జెట్‌ఎయిర్‌వేస్‌ పైలట్లకు జీతాలనుసైతం చెల్లించలేకపోయింది. చివరకు బిడ్లను గురువారం పొడిగించింది. ఎస్‌బి ఆధ్వర్యంలోని బ్యాంకర్ల కూటమి జెట్‌ఎయిర్‌వేస్‌కు రుణపరిష్కారమార్గాన్ని వేగవంతంచేస్తోంది. ఆర్ధికంగాపరిపుష్టి ఉన్న బిడ్డర్లు తమతమ సందేహాలను నివృత్తిచేసుకునేందుకు గురువారం వరకూ మాత్రమే గడువు విదించింది. అలాగే బుధవారంతోనే బిడ్ల దాఖలుకు గడువును ముగించింది. అర్హత కలిగిన బిడ్డర్లు తమతమ బైడింగ్‌ బిడ్స్‌ ఈనెలాఖరువరకూదాఖలుచేసుకోవచ్చు. ఎస్‌బిఐ కేపిటల్‌మార్కెట్స్‌ తన వెబ్‌సైట్‌లో ఈనోటీసును దాఖలుచేసింది. ఎస్‌బిఐ ఆధ్వర్యంలోని బ్యాంకర్ల కూటమి రుణపరిష్కారప్రనాళికను వేగవంతంచేసింది. ఆసక్తిచూపిస్తు దాఖలయిన బిడ్లను గడువులోపే కావాలని, లిఖితపూర్వకమైన కాగితరూపంలోని బిడ్లను ఈనెల 16వ తేదీలోపు దాఖలుచేయవచ్చని వెల్లడించింది. అంతకుముందు ఎస్‌బిఐ కేపిటల్‌మార్కెట్స్‌ కొన్ని సందేహాలపై వివరణలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. బిడ్డర్లు సాల్వెన్సీ సర్టిఫికేట్లుసైతం వారి అధికారిక ముద్రవున్న లేఖలపై అందచేయాల్సి ఉంటుంది. ఎండి, పూర్తికాలపు డైరెక్టర్‌, సిఇఒ వంటి వారు సంతకాలుచేయాల్సి ఉంటుంది. ఇక కన్సార్టియం పరంగాచూస్తే ప్రతిసభ్యులు కూడా సాల్వెన్సీ సర్టిఫికేట్‌ను దాఖలుచేయాల్సి ఉంటుంది.

తాజా వీడియోల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/videos