మేము రుణాలిస్తామంటే మీరే తీసుకోవట్లేదు

వ్యాపార, పారిశ్రామికరంగానికి ఎస్బీఐ చెర్మన్‌ పిలుపు

Rajnish Kumar
Rajnish Kumar

న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి అప్పులు తీసుకోవాలని, ఆ తర్వతా వాటిని పెట్టుబడులుగా పెట్టుకోవాలని దేశీయ వ్యాపార, పారిశ్రామికరంగానికి ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ చైర్మెన్‌ రజనీష్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. శనివారం ఫిక్కీ 92వ వార్షిక సదస్సులో రజనీష్‌ కుమార్‌ మాట్లాడారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని పెట్టుబడులు పెడితే రుణపరిమితి పెరుగుతుందన్నారు. నేడు బ్యాంకింగ్‌ క్రెడిట్‌ పరిమాణం రూ.96 లక్షల కోట్లుగా ఉందని, 5లక్షల కోట్ల డాలర్ల జీడీపీ సాధనకు ఈ పరిమాణం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. వివిధ రంగాలకు చెందిన కార్పోరేట్లు రుణాలు తీసుకొని, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులు ఊతం ఇవ్వాలని ఆయన కోరారు. ఎస్బీఐకి ప్రస్తుతం రూ.8లక్షల కోట్ల రుణ జారీ పరిమితి ఉందని, కానీ ఇప్పటి దాకా రూ.5లక్షల నుంచి ఆరు లక్షల కోట్ల మేరకే డిమాండ్‌ కనిపించదన్నారు. తాము నిధులతో సిద్ధంగా ఉన్నామని, మీరు తీసుకోవడం లేదని రజనీష్‌ కుమార్‌ అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/