బంధన్‌ బ్యాంకు, గృహ ఫైనాన్స్‌ డీలా

ముంబై, : హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్‌ సంస్థ గృహ ఫైనాన్స్‌ కొనుగోలుకి బంధన్‌ బ్యాంకును రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా అనుమతించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. దీంతో ఈ షేరు నష్టాలను చవిచూశాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో బంధన్‌ బ్యాంకు షేరు 2.7శాతం క్షీణించి రూ.498వద్ద ట్రేడవుతోంది. మొదట రూ.494వరకూ వెనకడుగు వేసింది. ఈ దారిలోనే గృహ ఫైనాన్స్‌ కూడా 2.4శాతం నష్టంతో రూ.275వద్దట్రేడవుతోంది. మొదట రూ.270వరకూ క్షీణించింది. కాగా మార్టిగేజ్‌ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి షేరు 0.25శాతం క్షీణించి రూ.1970వద్ద ట్రేడవుతోంది. హెచ్‌డిఎఫ్‌సి వాటాను తగ్గించుకోవడం పూర్తయ్యేంతవరకూ బంధన్‌ బ్యాంకు షేరు అమ్మకాల ఒత్తిడితో డీలాపడింది. గృహ ఫైనాన్స్‌ కొనుగోలు వ్యవయభరితమని అభిప్రాయపడింది. దీంతో బంధన్‌ బ్యాంకు షేరుకి అండర్‌పెర్ఫార్మ్‌ రేటింగ్‌ను ఇస్తూ రూ.400టార్గెట్‌ ధరను ప్రకటించింది. గృహ ఫైనాన్స్‌లో దాదాపు 58శాతం వాటా కలిగిన మాతృ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి, విలీన సంస్థలో 15 శాతంవాటాను పొందనుంది. దీంతో ఆర్‌బిఐ నిబంధనలకు అనుగుణంగా విలీన సంస్థలో హెచ్‌డిఎఫ్‌సి 5 శాతం వాటాను విక్రయించవలసి ఉంటుందని మెక్వారీ వివరించింది. ఇది బంధన్‌ బ్యాంకు షేర్ల సరఫరాను పెంచుతుందని తెలియచేసింది.

https://www.vaartha.com/news/business/మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.