త్వరలో భారత మార్కెట్లోకి బజాజ్‌ ‘క్యూట్‌’

Bajaj Qute
Bajaj Qute

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ ఉత్పత్తుల సంస్థ బజాబ్‌ ఆటో ఇప్పుడు కార్త తయారీలోకి అడుగుపెట్టింది. బజాబ్‌ ‘క్యూట్‌’ పేరుతో తొలిసారిగా కార్లను తయారు చేస్తుంది. అయితే ఏప్రిల్‌ 18న అధికారికంగా ఈ కారును భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఈరోజు ప్రకటించింది. అంతేగాక.. భారత్‌లోనే తొలి క్వాడ్రిసైకిల్‌ ఇదే కావడం విశేషం. అంటే డిజైన్‌, వినియోగం పరంగా ఆటో, కారుకు మధ్యస్తంగా ఉంటుంది. క్వాడ్రిసైకిల్‌ వాహనాల తయారీకి 2018లో కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ వాహనాలను అటు కమర్షియల్‌గానూ.. ఇటు వ్యక్తిగత అవసరాలకు వాడుకోవచ్చు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ కారును తీసుకొస్తున్నట్లు గతంలో బజాజ్‌ వెల్లడించింది. అందుకే అందుబాటు ధరల్లో విడుదల చేస్తోంది. పెట్రోల్‌ వెర్షన్‌ ధర రూ. 2.64లక్షలు, సీఎన్‌జీ వెర్షన్‌ ధర రూ. 2.84లక్షలుగా(ఎక్స్‌షోరూం) ఉంటుందని తెలిపింది.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/