45 శాతం క్షిణించిన అశోక్‌ లేలాండ్‌ లాభం

Ashok Leyland
Ashok Leyland

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ ముగింపు త్రైమాసికంలో అశోక్ లేలాండ్ రూ.230 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.422 కోట్ల నికర లాభం వచ్చిందని కంపెనీ వెల్లడించింది. అంటే లాభం 45 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం రూ.6,263 కోట్ల నుంచి రూ.5,684 కోట్లకు తగ్గిందని కంపెనీ చైర్మన్ ధీరజ్ జి. హిందుజా తెలిపారు. పూర్తి ఏడాది పరంగా చూస్తే, గత ఆర్థిక సంవత్సరంలో రూ.33,325 కోట్ల ఆదాయం, రూ.2,195 కోట్ల నికర లాభం సాధించామని పేర్కొన్నారు. వాహన పరిశ్రమలో అమ్మకాలు 17 శాతం తగ్గగా, తమ కంపెనీ మార్కెట్ వాటా 4 శాతం పెరిగిందని ధీరజ్ వెల్లడించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/