అశోక్‌లేలాండ్‌ ఉత్పత్తి తగ్గింపు!

Ashok Leyland Production Cut
Ashok Leyland Production Cut

చెన్నై: ఆటోమొబైల్‌ రంగంలో నెలకొన్న అమ్మకాల మాంద్యం చివరకు ఫ్యాక్టరీ లను మూతవేసే దిశకు తెస్తోంది. మారుతి సుజుకి, మహీంద్ర, హుండై ఇలా పేరుపొందిన సంస్థలన్నీ తమవద్ద ఉన్న ప్రస్తుత నిల్వలను క్లియర్‌ చేసుకునేందుకు వీలుగా ఉత్పత్తిని కొన్ని రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. అదే బాటలో ఇపుడు తాజాగా అశోక్‌లేలాండ్‌ సైతం నడిచింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఉత్పత్తి ప్లాంట్లలో ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు వెల్లడించింది. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని సర్దుబాటుచేసేందుకే ఈచర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. కంపెనీ పరంగా భారీ, తేలికపాటి వాణిజ్యవాహనాలను ఉత్పత్తిచేస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబరు నెలలో వివిధ తేదీల్లో ఈ ఉత్పత్తిని నిలిపివేస్తా మని హిందూజా గ్రూప్‌ ప్రతిష్టాత్మక సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ సమాచారం స్టాక్‌ ఎక్ఛేంజీలకుసైతం నివేదించింది. చెన్నై కేంద్రంగా ఉన్న ఈ సంస్థ 16 రోజులపాటు ఎన్నోర్‌ ఉత్పత్తిప్లాంట్‌లో తయారీని నిలిపి వేస్తోంది. తమిళనాడులోని హోసూరులో ఉన్న మరోకేంద్రంలో ఐదురోజులపాటు ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది. రాజస్థాన్‌లోని ఆల్వార్‌లో పదిరోజులు, మహారాష్ట్రలోని భందారాలో పదిరోజులు, ఉత్తరాఖండ్‌లోని పంత్‌నగర్‌లో 18 రోజులపాటు ఉత్పత్తిని నిలిపి వేస్తున్నట్లు వెల్లడించింది. దేశీయ ఆటోమొబైల్‌ రంగంలో నెలకొన్న అమ్మకాల మాంద్యం వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నం అయిందని, ఆటోకంపెనీల ను ఖచ్చితంగా ఉత్పత్తిని కుదించుకునేటట్లు చేస్తోందని సియామ్‌ వంటి సంస్థలు వెల్లడిస్తు న్నాయి. మొత్తంగా వాణిజ్యవాహనాల అమ్మకాలు 38.71శాతం క్షీణించి 51,897 యూనిట్లకు చేరాయి. అంతకుముందు ఏడాది ఆగస్టులో 84,668 యూన్టిలో పోలిస్తే భారీ పతనం నెల కొంది. ఆగస్టులో వాణిజ్య వాహన ఉత్పత్తి దారులు తమ ఉత్పత్తిని తమతమ ప్లాంట్లలో 42.05శాతం తగ్గించారు. అంటే 54,873 యూనిట్లు మాత్రమే ఉత్పత్తిచేసారు. అదేగత ఏడాది 94,698 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు సియామ్‌ వెల్లడించింది. గతనెలలోనే మహీంద్ర అండ్‌ మహీంద్ర 8-14 రోజులపాటు ఉత్పత్తిని నిలిపివేస్తామని ప్రకటించింది. ఇక టాటా మోటార్స్‌సైతం ఉత్పత్తిని మార్కెట్‌ స్థితిగతులకు అనుగుణంగా సర్దుబాటుచేస్తున్నట్లు వెల్లడించింది. ప్యాసింజర్‌ వాహన ఉత్పత్తిదారులుసైత ం ఇదే రూటు ఎంచుకున్నారు. మారుతిసుజుకి ఇండియా కూడా ఉత్పత్తిని కుదించేందుకు నిర్ణయించింది. 33.99 శాతం ఆగస్టులో ఉత్పత్తిని తగ్గించింది. వరుసగా ఏడోనెలలో కూడా మారుతిసుజుకి తన ఉత్పత్తిని మార్కెట్‌కు అనుగుణంగా కుదించింది. ఆటోమొబైల్‌ ఉత్పత్తి దారుల సంఘాల సమాఖ్య సియామ్‌ ప్రారంభించిన 1997-98నాటి గణాం కాలతో చూస్తే టోకుగా తగ్గిపోయాయి. వివిధ కేటగిరీలపరంగాచూస్తే ప్యాసిం జర్‌, టూవీలర్లు, వాణిజ్య వాహనాలు 18,21,490 యూనిట్లుగా గతనెలలో నమోదయ్యాయి. అంతకుముందు ఏడాది 23,82,436 యూనిట్లతో పోలిస్తే 23.55 శాతం క్షీణించింది. ఉత్పత్తి తగ్గిస్తుండటంతో లేలాండ్‌ షేర్లు కూడా 1.56శాతం ముందురోజు తగ్గిపోయాయి.