అరవింద్‌ జోరు, ఐపేపర్‌ డల్‌

ARAVINDstores
ARVIND stores new deals

ముంబై : ప్రత్యేక కంపెనీగా స్టాక్‌ ఎక్ఛేంజీలలో లిస్టయ్యాక లాభాల్లో సాగుతున్న అరవింద్‌ ఫ్యాషన్స్‌ షేరుకు మరోసారి డిమాండ్‌ పుట్టుకొచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 10 శాతం పెరిగి రూ.1058.5వద్ద ఫ్రీజయ్యింది. ఇది సరికొత్త గరిష్టం కాగా, మార్చి 8న రూ.590వద్ద లిస్టయిన ఈ షేరు ఇప్పటివరకూ 79శాతం పెరిగింది. అరవింద్‌ ఫ్యాషన్స్‌ పేరుతో టెక్స్‌టైల్‌ బ్రాండ్లు, రిటైల్‌ విభాగాన్ని ప్రత్యేక కంపెనీగా లాల్‌భా§్‌ు గ్రూప్‌ సంస్థ ఈ సంస్థను విడదీసింది. దీనిలో భాగంగా అరవింద్‌ లిమిటెడ్‌ వాటాదారులకు తమ వద్దనున్న ప్రతీ 5 షేర్లకుగాను ఒక అరవింద్‌ ఫ్యాషన్స్‌ షేరుని కేటాయించిన విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్‌ పేపర్‌ కూడా ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో గల పేపర్‌ ఉత్పత్తి ప్లాంటును నిర్వహణ కోసం ఐదు రోజుల పాటు మూసివేస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ పేపర్‌ ఏపిపిఎం తాజాగా వెల్లడించింది. ఈ నెల 25 నుంచి 30 వరకూ నిర్వహణ పనుల కోసం యూనిట్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలియచేసింది. దీంతో రోజుకి 500 టన్నుల మేర పేపర్‌ తయారీకి విఘాతం కలగనున్నట్లు వివరించింది. దీంతో ఈ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో దాదాపు 4 శాతం క్షీణించి రూ.438వద్ద కదులుతోంది.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/