రిలయన్స్‌లో 25% ఆరామ్‌కోకు వాటా!

reliance industries
reliance industries

న్యూఢిల్లీ: సౌదీకి చెందిన ప్రముఖ క్రూడాయిల్‌ ఉత్పత్తి సంస్థ ఆరామ్‌కో భారత దేశ దిగ్గజ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లో వాటా కొనుగోలు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. పెట్రో కెమికల్‌ బిజినెస్‌లో కనీసం 25శాతం వాటా తీసుకునేందుకు ఉత్సాహపడుతున్నట్లు ఒక పత్రిక కథనం ప్రకారం తెలిసింది. 25 శాతం మైనార్టీ వాటా కొనుగోలుకు 10నుంచి 15బిలియన్‌ డాలర్లు ఖర్చుచేసేందుకు కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మన కరెన్సీలో చూసుకుంటే సుమారు రూ.70వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల వరకూ ఉంటుంది. దీంతో రిలయన్స్‌కు చెందిన రిఫైనింగ్‌, పెట్రో కెమికల్‌ బిజినెస్‌ వాటాల విలువ 55నుంచి 60 బిలియన్‌ డాలర్ల వరకూ ఉంటుంది. అంటే సుమారు రూ.4.2లక్షల కోట్లకు అంచనా. జూన్‌లో ఈ రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. గోల్డ్‌మెన్‌ శాక్స్‌ ఈ డీల్‌కు సంబంధించి విలువతో సహా అనేక అంశాలను పర్యవేక్షిస్తోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/