జెట్ ఎయిర్‌వేస్ నుంచి వైదొలిగిన అనిల్ అగర్వాల్

Anil-Agarwal
Anil-Agarwal

న్యూఢిల్లీ: అప్పుల ఊబిలో కూరుకుపోయిన మూతపడిన ప్రైవేటు విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ పునరుద్ధరణ ఆశలు అడియాసలు అవుతున్నాయి. మైనింగ్, మెటల్ దిగ్గజం అనిల్ అగర్వాల్ ఫ్యామిలీ ట్రస్ట్ వోల్కన్ ఇన్వెస్ట్‌మెంట్ జెట్ ఎయిర్‌వేస్ బిడ్‌ను ఉపసంహరించుకుంది. గత శనివారం గడువు ముగింపు వరకు మూడు అంతర్జాతీయ సంస్థలు బిడ్‌ను దాఖలు చేశాయి. అయితే ప్రస్తుతం రెండు సంస్థలు అవంతులో గ్రూప్, ఆర్‌ఎ క్రియెటర్‌లు బరిలో ఉన్నాయి. జెట్‌లో సమస్యలను పరిష్కరించని కారణంగా బిడ్‌కు సుముఖంగా లేమని 24 శాతం వాటాలను కల్గిన ఎతిహాద్ ప్రకటించిన తర్వాత వోల్కన్ వెనక్కి తగ్గింది. కాగా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి ఈ ఏడాది ఏప్రిల్‌లో విమానయాన సేవలకు జెట్ ఎయిర్‌వేస్ దూరమైన విషయం తెలిసిందే.


తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/women/