టాటాసన్స్‌ బోర్డుకు ఇద్దరు డైరెక్టర్ల గుడ్‌బై..!

tatasons company
tatasons company

ముంబయి: టాటాసన్స్‌ బోర్డు సమావేశానికి ఈసారి ఇద్దరు డైరెక్టర్లు అమిత్‌ చంద్ర, రణేంద్రసేన్‌లు రాకపోవడం వీరి నిష్క్రమిస్తున్నారా అన్న సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ ఇద్దరు వైదొలగడంతో తొమ్మిది మంది సభ్యులున్న టాటాగ్రూప్‌ హోల్డింగ్‌కంపెనీ సంఖ్య ఇపుడు ఏడుగురికి తగ్గింది. గత శుక్రవారమే టాటాసన్స్‌ బోర్డు డైరెకట్ల్ర సమావేశం జరిగితే ఈ ఇద్దరు డైరెక్టర్లకు ఇదే చివరి సమావేశంగా చెపుతున్నారు. బోర్డులో సేన్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ స్వతంత్ర డైరెక్టర్‌గా కొనసాగారు. ఆయన తన రిటైర్‌మెంట్‌వయసుకు చేరుకున్నారు. అలాగే చంద్రకు అయితే ఆయన రాజీనామాను ఆమోదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం బోర్డులో ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేకరణకాకుండా వేణుశ్రీనివాసన్‌, హరీష్‌ మన్వాని, ఫరీదా ఖంబాట్టా, రాల్ఫ్‌స్పేత్‌, అజ§్‌ు పిరమల్‌, భాస్కర్‌భట్‌, సౌరభ్‌ అగర్వాల్‌ వంటివారు మాత్రమే ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది టాటాగ్రూప్‌సంస్థల్లో ప్రాతినిధ్యం ఉన్నవారే. గత ఏడాదే అమిత్‌చంద్ర డైరెక్టర్‌గా రాజీనామా చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలను ఆయన సాకుగా చూపించారు. ఆయన పదవీకాలం మార్చితో ముగుస్తుంది. బెయిన్‌కేపిటల్‌ ఎండి కూడా వివిధ టాటాట్రస్టులనుంచి ట్రస్టీగా వైదొలిగారు. చంద్ర కూడా టాటాసన్స్‌ బోర్డునుంచి, ట్రస్టులనుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. సేన్‌ను టాటాసన్స్‌ బోర్డులో 2015 ఏప్రిల్‌నెలలో నియమించారు. అమెరికాకు భారత రాయబారిగా 2004నుంచి 20098 వరకూ పనిచేసారు. మెక్సికోకు 10991-92లో కూడా రాయబారిగాపనిచేసారు. రష్యన్‌ఫెడరేషన్‌కు 1992-98లోను, జర్మనీకి 1998-2002లోను పనిచేసారు. బ్రిటన్‌ హైకమిషనర్‌గా 2002-04వరకూ పనిచేసిన 74 ఏళ్ల సేన్‌ టాటామోటార్స్‌ బోర్డులో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌గా రెండేళ్లపాటు పనిచేసారు.