అమెజాన్‌ వెబ్‌సర్వీస్‌ల అధ్యక్షుడిగా పునీత్‌ చందోక్‌!

Puneet Chandok
Puneet Chandok

న్యూఢిల్లీ: అమెజాన్‌ వెబ్‌ సర్వీసుల ఇండియా విభాగానికి నూతన అధ్యక్షుడిగా పునీత్‌ చందోక్‌ను నియమించనున్నట్లు ఒక ఆంగ్లపత్రిక వెల్లడించింది. అయితే దీనిపై అమెజాన్‌ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అమెజాన్‌ వెబ్‌సర్వీసులు కీలకమైన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలను అందజేస్తుంది. ఈ సేవలను భారత్‌లో ప్రారంభించినప్పటి నుంచి బిక్రమ్‌ బేడీనే అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు బిక్రమ్‌ బేడీ నుంచి ఈ పగ్గాలను పునీత్‌కు అప్పగించనున్నారు. ప్రస్తుతం పునీత్‌ చందోక్‌ మెకిన్సీ అండ్‌ కంపెనీలో పనిచేస్తున్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/