ఆమెజాన్‌ ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ మరిన్ని ఆఫర్లతో ప్రారంభం

amazon-fab-phones-fest-2020-sale-kicks
amazon-fab-phones-fest-2020-sale-kicks

ముంబయి: ప్రముఖ ఈకామర్స్‌ సంస్థ అమెజాన్‌ తన సైట్‌లో ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ను మళ్లీ ప్రారంభించింది. నేటి (బుధవారం)నుంచి 29వ తేదీ వరకు ఈ సేల్‌ కొనసాగనుంది. దీనికి ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా కార్డుల ద్వారా జరిపే కొనుగోళ్లపై ఫోన్లపై 10 శాతం వరకు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ 2020 సేల్‌లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ప్రధానంగా శాంసంగ్‌, షావోమి, రియల్‌మి, ఆపిల్‌, వన్‌ప్లస్‌ తదితర కంపెనీలకు చెందిన ఫోన్లను భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేయచ్చు. ఐఫోన్‌ 11 ప్రొ మ్యాక్స్‌ను రూ.3వేల తగ్గింపు ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. అలాగే రెడ్‌మి కే2 ప్రొ తోపాటు, ఐఫోన్‌ 11 ప్రొ, ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌, ఐఫోన్‌ 7 ఫోన్లపై కూడా తగ్గింపు ధరలను అందిస్తోంది అమెజాన్‌.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/