టాప్‌ 100 సంస్థల్లో అమెజాన్‌ నంబర్‌వన్‌!

రెండు యాపిల్‌, మూడు గూగుల్‌

amazon
amazon

న్యూఢిల్లీ: అమెరికా రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌ ఇపుడు అక్కడి దిగ్గజాలన్నింటికంటే సంపదల్లో ముందంజలో ఉంది. యాపిల్‌, గూగుల్‌ వంటిప్రపంచ విలువైన బ్రాండ్లను అధిగమించి నంబర్‌వన్‌ బ్రాండ్‌గా నిలిచింది. అమెజాన్‌బ్రాండ్‌ విలువలు 52శాతం పెరిగి 315 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. గ్లోబల్‌ మార్కెట్‌రీసెస్చి ఏజెన్సీ కాంటార్‌ తన నివేదికలో 2019లో టాప్‌ 100 బ్రాండ్జ్‌ నివేదికలో అమెజాన్‌ మూడవ స్థానంనుంచి మొదటిస్థానానికి వచ్చింది. గూగుల్‌ మొదటిస్థానంనుంచి మూడోస్థానానికి దిగజారితే యాపిల్‌ తన రెండోస్థానాన్ని కొనసాగించింది. సీటెల్‌ కేంద్రంగా ఉన్న రిటైల్‌దిగ్గజం అమెజాన్‌ జెఫ్‌బెజోస్‌ ఆధ్వర్యంలో 1994లో ప్రారంభించారు.

కీలకమైన కొనుగోళ్లు, సంస్థల స్వాధీనం విలీనం వంటి వాటితోపాటు కస్టమర్‌సేవల్లోసైతం సంస్థ నంబర్‌వన్‌గా నిలిచింది. బిజినెస్‌ మోడల్‌లో కూడా నంబర్‌వన్‌స్థాళనం చేజిక్కించుకుంది. కాంటార్‌ ఏజెన్సీ బ్రిటిష్‌ అడ్వర్టయిజింగగ్రూప్‌ డబ్ల్యు పిపి సంసథకు సంబంధించింది. అమెజాన్‌ ఈమధ్యకాలంలో వృద్ధిలో కొంత మందగించినా నంబర్‌వన్‌స్థానం మాత్రం నిలబెట్టుకుంది. అమెరికా సంస్థల్లో యాపిల్‌ 309.5 బిలియన్‌ డాలర్లు, గూగుల్‌ 309 బిలియన్‌ డాలర్లు, మైక్రోసాప్ట్‌ 251 బిలియన్‌డాలర్ల సంపదతో ఉన్నాయి. ఇక పేమెంట్స్‌ సంస్థ వీసా ఐదోస్థానంలో 178 బిలియన్‌ డాలర్లతోనిలిస్తే సోషల్‌ నెట్‌వర్కింగ్‌గ్రూప్‌ ఫేస్బఉక్‌ ఆరో అతిపెద్ద సంస్థగా 159 బిలియన్‌డాలర్ల సంపదతో ఉంది. మొట్టమొదటిసారిగా చైనాకు చెందిన ఆలిబాబా టెన్సెంట్‌ను అధిగమించి అత్యంత విలువైన చైనాబ్రాండ్‌గా నిలిచింది.

ఇకామర్స్‌ దిగ్గజం ఆలిబాబా ఏడో అతిపెద్ద సంస్థలగా 131.2 బిలియన్‌ డాలర్లతో నిలిచింది. రెండుస్థానాలను అధిగమించింది. ఇంటర్నెట్‌ దిగ్గజం టెన్సెంట్‌ మూడుస్థానాలు దిగజారి ఎనిమిదోస్థానంలో 130.9 బిలియన్‌ డారల్లవద్ద నిలిచింది. అభివృద్ధిలో దూసుకువస్తున్న ఆర్ధికవృద్ధి కీలకంగా మారింది. మొత్తం 100 బ్రాండ్లలో 23 బ్రాండ్లు ఆసియా సంస్థలే కావడం. వాటిలో 15 సంస్థలు చైనానుంచే ఉన్నాయి. గత ఏడాది అమెజాన్‌ 108 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉంది. క్రమేపీ పెరుగుతూ నిలెబట్టుకుందని కాంటార్స్‌ గ్లోబల్‌ హెడ్‌ డోరీన్‌ వాంగ్‌ వెల్లడించారు. అమెజాన్‌, గూగుల్‌, ఆలిబాబాసంస్థలు టెక్నాలజీ ప్రభావంతో మొత్తం అన్ని బ్రాండ్లను ట్రేడింగ్‌చేస్తుండటంతో టెక్‌ ఆధారిత బిజినెస్‌ సంస్థలుగానే నిలిచాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/