జియోకు పోటీగా ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌!

airtel
airtel


న్యూఢిల్లీ: జియోఫైబర్‌ మార్కెట్‌లోప్రవేశించి సంచలనం సృష్టిస్తున్న తరుణంలోనే అందుకు పోటీగా ఎయిర్‌టైల్‌ కూడా బ్రాడ్‌బ్యాండ్‌తో కూడిన ప్లాన ్‌ను అదేధరకు ప్రారంభించింది. ఎయిర్‌టెల్‌ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌బ్రాడ్‌బ్యాండ్‌ ప్రణాళికలు నెట్‌ఫ్లిక్స్‌, అమెజాన్‌ప్రైమ్‌, జీ5, ఎయిర్‌టెల్‌ఎక్స్‌ట్రీమ్‌గా వస్తున్నాయి. అదేసమయంలో జియోఫైబర్‌ కూడా 3999 నెలసరిధరకు 2500 జిబి డేటాను సైతం అందిస్తోంది. జియోఫైబర్‌ నెలవారీ ప్లాన్‌లో రూ.699కి 100 జిబి డేటాను అందిస్తోంది. అదికూడా 100 ఎంబిపిఎస్‌ వేగంతో వస్తుంది. ఉచిత వాయిస్‌కాల్స్‌, వీడియోకాన్ఫరెన్స్‌కాల్స్‌ ఒక టివిద్వారా అందించుకోవచ్చు. హైస్పీడ్‌ గేమింగ్‌ వసతిని కూడా హోమ్‌ నెట్‌వర్క్‌లో పొందుపరిచింది. అలాగే వన్‌జిబిపిఎస్‌ కనెక్షన్‌ను 3999కే నెలవారీగా 2500 జిబి డేటాతో అందిస్తోంది. ఇపుడు ఎయిర్‌టెల్‌ ప్రాథమిక స్థాయిలో ఢిల్లీ, గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌; నోయిడా, ఘజియాబాద్‌; ముంబయి, పూణె, బెంగలూరు, హైదరాబాద్‌, చెన్నై, ఛండీఘర్‌, కోల్‌కత్తా, ఇండోర్‌,జైపూర్‌, అహ్మదాబాద్‌ నగరాల్లో ఈ కొత్త స్కీంను ప్రవేశపెట్టింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/business/