అంచనాలను మించిన ఎయిర్‌టెల్‌ రైట్స్‌ ఇష్య

Airtel Rights issue
ముంబయి: టెలికాం రంగంలో దిగ్గజం గా కొనసాగుతున్న భారతి ఎయిర్‌టెల్‌ 25వేల కోట్ల రైట్స్‌ఇష్యూ పూర్తిగా కొనుగోళ్లు జరిగా యి. ఈ వాటా జారీ విధా నంలో వచ్చిన ఎక్కువ మొత్తాన్ని రుణభారం తగ్గించుకునేందుకు వినియోగి స్తుంది. అంతేకాకుండా రుణసమీకరణ వ్యయాలను కూడా తగ్గించుకునేందుకు విని యోగించాలని కంపెనీ నిర్ణయించింది. నిధుల సమీకరణకోసం కంపెనీ జారీచేసిన భారీ రైట్స్‌ ఇష్యూలో విజయవంతం అయిందనే చెప్పాలి. జియోరాకతో టెలికాం రంగంలో అప్పటి వరకూ ఆధిపత్యం వహించిన కంపెనీలు తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే. పలు కంపెనీలు విలీనం అయ్యాయి, మరికొన్ని కంపెనీలు జాయింట్‌ వెంచర్లకు వచ్చాయి. అయితే ఒక్క ఎయిర్‌టెల్‌ మాత్రమే స్వతంత్రంగా కొనసాగుతూ చిన్న చిన్న కంపెనీలను కొనుగోలుచేసి పోటీనుంచి నిలదొక్కు కోగలగుతున్నది. ఇపుడు కొత్తగా నిధుల సమీకరణకు చేపట్టిన రైట్స్‌ ఇష్యూ అంచనాలకు మించి కొనుగోళ్లు జరిగినట్లు కంపెనీ బిఎస్‌ఇకి నివేదికిచ్చింది. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌ ఒకరు ఈ రైట్స్‌ఇష్యూ ను పర్యవేక్షిస్తోంది. 105 శాతం కొనుగోళ్లు జరిగినట్లుకంపెనీ భావిస్తోంది ఎన్‌ఎస్‌ఇ, బిఎస్‌ఇ గణాంకాల ఆధారంగాచూస్తే 690 మిలియన్‌షేర్లకు బిడ్లు అందాయి. 1.13 బిలియన్‌ వాటాల రైట్స్‌ ఇషూలో 61శాతం బిడ్లు అందాయి. కంపెనీలో ఉన్న ఒక వాటాదారు మరొక ఇన్వెస్టరుకు వాటాలను బదలాయించనున్నారు. రుణభారం తగ్గించుకునేం దుకు ఒకవైపు మరోవైపు రిలయన్స్‌ జియోను అధిగమించే ప్రణాళికలకు ఈ మొత్తం వినియోగిస్తారని తేలింది. అలాగే 5జి స్పెక్ట్రమ్‌ వేలానికిసైతం కొంతమొత్తం వినియోగించవచ్చని అంచనా. భారతి ఎయిర్‌టెల్‌ వాటాలు వారాంతంలో 328వద్ద బిఎస్‌ఇలోముగిసాయి. తాజాగా చేపట్టిన నిధుల సమీకరణతో భారతి ఎయిర్‌టెల్‌ ఈక్విటీబేస్‌ 5.13 బిలియన్‌ ఈక్విటీ వాటాలతో ఉన్నట్లు తెలుస్తుంది. రైట్స్‌ ఇష్యూను యాక్సిస్‌ కేపిటల్‌, జెపి మోర్గాన్‌, గోల్డ్‌మాన్‌శాక్స్‌, హెచ్‌ఎస్‌బిసి సెక్యూరిటీస్‌, ఐసిఐసిఐ సెక్యూరిటీస్‌ పర్యవేక్షిస్తున్నాయి. ఫిబ్రవరిలోనే సంస్థబోర్డు 32వేల కోట్ల నిధుల సమీకరణకు అనుమతులు మంజూరుచేసింది. 25వేల కోట్లు రైట్స్‌ ఇష్యూ ద్వారాను, బాండ్ల విక్రయం ద్వారా ఏడువేల కోట్ల సమీకరణకు నిర్ణయించింది. ఒక్కొక్క వాటాను 220 చొప్పున ఈ రైట్స్‌ ఇష్యూలో విక్రయించనున్నది. ఎయిర్‌టెల్‌లో గతనెల 24వ తేదీవరకూ ఉన్న వాటాదారులు ప్రతి 67 వాటాలున్నవారు 19 రైట్స్‌ ఇష్యూ వాటాలను కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రమోటర్‌గ్రూప్‌ సింగ్‌టెల్‌, భారతి టెలికామ్‌లు 11,786 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేసాయి. మిగిలిన మొత్తానికి పబ్లిక్‌నుంచి బిడ్లను ఆహ్వానించింది. సింగపూర్‌ ప్రభుత్వ పెట్టుబడుల సంస్థ జిఐసి ప్రైవేట్‌, ఐదువేల కోట్లతో కొనుగోలు కు ముందుకువచ్చింది. 4.4శాతం ఎయిర్‌టెల్‌ రైట్స్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించింది. సింగ్‌టెల్‌ తన వార్షిక నివేదికలో భారత్‌తో వాణిజ్య సంబంధాలు దీర్ఘకాలిక ప్రాతిపదికగా ఉంటాయని వెల్లడించడంతో మరింతగా పెట్టుబడులకు వస్తుందని అంచనా. భారతి టెలికామ్‌లో సింగ్‌టెల్‌ తన వాటాను పెంచుకుంటూ వచ్చింది. వొడాఫోన్‌ ఐడియా 25వేల కోట్లు సమీకరించిన రైట్స్‌ఇష్యూకు నెలరోజుల లోపుగానే ఎయిర్‌టెల్‌ రైట్స్‌ ఇష్యూకు వచ్చింది. వొడాఫోన్‌ ఐడియా రైట్స్‌ ఇష్యూ 1.08 రెట్లు కొనుగోళ్లు జరిగాయి. ఆదిత్యబిర్లాగ్రూప్‌, యుకె వొడాఫోన్‌గ్రూప్‌లు 17,920 కోట్లను కేటాయించి వారి వాటాలను కంపెనీలో 71.57 శాతం, 71.33శాతంగా ఉన్నవాటి నుంచి రైట్స్‌ ఇష్యూకు కొంత కేటాయింపులు చేసాయి. పైగా ఈ కంపెనీలు ప్రభుత్వం ఏడాది వేలంకు వస్తున్న 5జి స్పెక్ట్రమ్‌కు సైతం పెట్టుబడుల కోసం ముందుగానే నిధులను సమీకరిం చుకుంటున్నట్లు ఈరైట్స్‌ ఇష్యూ స్పష్టం చేస్తోంది.