రూ.49 చేసుకుంటేనే ఇన్‌కమింగ్‌

రేపటినుంచి కాల్‌ చార్జీల పెంపు

Raise Tariffs
Raise Tariffs

ఢిల్లీ: గత ఐదేళ్లలో మొదటిసారి ప్రీపెయిడ్‌ కస్టమర్లకు వాయిస్‌ కాల్‌, డేటా చార్జీలు పెరుగతున్నాయి. నష్టాల కారణంగా ఎయిర్‌, జియో, వోడా ఐడియా తమ కాల్‌ డేటా చార్జీలను పెంచనున్నామని తెలిపిన విషయం తెలిసిందే. కాగా ఈ ధరల పెంపు డిసెంబర్‌ 3 నుంచి జరుగుతుందని వోడాఫోన్‌ ఐడియా, ఎయిర్‌ టెల్‌ ప్రకటించాయి. కాగా నెలకు రూ. 49తో రీచార్జ్‌ చేసుకుంటేనే కస్టమర్లకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ వస్తాయని, ప్రతి కస్టమర్‌ రూ. 49తో రీచార్జ్‌ చేసుకోవల్సిందిగా ఆ సంస్థలు కోరాయి. జియో రాకతో అపరిమిత కాల్స్‌ తెరపైకి వచ్చాయి. కాని ఇప్పుడు ఇవి కనుమరుగు కానున్నాయి. ఎయిర్‌ టెల్‌, వోడా ఐడియా ప్లాన్లలో తెచ్చిన మార్పులతో అపరిమిత కాల్స్‌కు చెక్‌ పెట్టాయి. ఏ నెట్‌వర్క్‌కైనా చేసే కాల్‌పై ప్రతి నిమిషానికి 6 పైసల చొప్పున వసూలు చేస్తామని సదరు సంస్థలు ప్రకటించాయి. వినియోగదారులు ఆయా ప్లాన్లలో ఉ్న పరిమిత కాల్‌ వ్యవధి దాటితే తప్పనిసరిగా టాపప్‌గా చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తమ సొంత నెట్‌వర్క్‌ల మధ్య కాల్స్‌కు మాత్రం ఉచిత సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఈ సంస్థలు పేర్కొన్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/